తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్రహీరోలు వరుసగా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్న సమయంలో తమదైన డ్యాన్సులు, ఫైట్ల తో ఇండస్ట్రీలో కొత్తరకం డ్యాన్సులను ఫైట్స్ ని చూపిస్తూ హిట్ మీద హిట్ కొడుతూ సుప్రీం స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తానికి మెగాస్టార్ అయిపోయిన చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన నాగబాబు ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేదు అందుకే ఆ తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ ని హీరోగా ఒక మంచి సినిమాతో ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకున్నారు చిరంజీవి.
అయితే తక్కువ టైంలోనే తనదైన మార్కుతో ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్.చిరంజీవి సినిమాలను వదిలేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించాడు దానికి యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ నియమించారు.
యూత్ తో కలుస్తూ మాట్లాడుతూ బహిరంగ సభలు నిర్వహిస్తూ తనదైన మార్కు చూపించారు పవన్ కళ్యాణ్.అయితే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ ఆయన ప్రస్తుతం జనసేన పార్టీ నీ పెట్టి రాజకీయాల్లో బిజీ అయినప్పటికీ అజ్ఞాతవాసి తన చివరి చిత్రంగా చేసి మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ వకీలు సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి ఆయన ఏది చేసిన సెన్సేషనల్ అయ్యేది.పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తో ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అయ్యారు.
అప్పటికి ఆయన కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తనదైన మార్క్ ని ఇండస్ట్రీపై చూపించడానికి అప్పటికే సిద్ధంగా ఉన్నారు.సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వకపోయినా అప్పటికీ తను చేసిన మార్షల్ ఆర్ట్స్ ఫీట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక పవన్ కళ్యాణ్ 1995లో వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.కానీ ఏమైందో తెలియదు కొద్దిరోజులకే ఇద్దరి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి.ఆ తర్వాత కొద్ది రోజులకే నందిని వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది.ఆమె తన మెయింటనెన్స్ కోసం నెలకి ఐదు లక్షలు పవన్ కళ్యాణ్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది.అయితే పవన్ కళ్యాణ్ 1999లో ఆమె నుంచి విడాకులు కోరగా ఆమె విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేదని తేల్చి చెప్పింది.2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రేణుదేశాయ్ తో పవన్ కళ్యాణ్ సహజీవనం చేయడం మొదలు పెట్టాడు.నందిని విడాకులు ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆ విషయం గురించి పట్టించుకోకుండా వరసగా సినిమాలు చేయడం సినిమాల్లో బిజీ గా ఉండడానికి ప్రయత్నించాడు.బద్రి, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో తన కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు.
దీంతో 2005 లో నందిని విడాకులకు అప్లై చేయాగా 2008లో వీళ్లకు విడాకులు మంజూరయ్యాయి.విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నందినికి ఐదు కోట్ల వరకు డబ్బులు కూడా ఇచ్చాడని అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది.
తర్వాత నందిని గా ఉన్న తన పేరు జాహ్నవి గా మార్చుకుంది.తర్వాత కొద్ది రోజులకే పింగలి రణధీర్ రెడ్డి, సుధా దంపతుల కుమారుడైన డాక్టర్ కృష్ణా రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం జాహ్నవి కృష్ణారెడ్డి గారు సంతోషంగా తమ లైఫ్ నీ కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.అయితే జాహ్నవి కృష్ణారెడ్డి ని పెళ్లి చేసుకునేటప్పటికి ఆమె వయస్సు 27 సంవత్సరాలు గా ఉంటుందని అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది.