తెలుగు తెరపై చాలామంది హీరోలుగా పరిచయమైన వారిలో కొందరు అగ్ర హీరోలు అయిపోయారు.అలాగే చిరంజీవి తమ్ముడు గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అనతికాలంలోనే పవర్ స్టార్ అనిపించుకున్నారు దాని తగ్గట్టుగానే ఆయన సినిమాలు ఉండేది మొదటి నుంచే పవన్ కళ్యాణ్ కి సామాజిక స్పృహ కొంచెం ఎక్కువగా ఉండేది.
ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునేవాడు ఎవరికైనా డబ్బులు అవసరం ఉంది అని తన దగ్గరికి వస్తే తన వంతు సహాయం చేసేవాడు అయితే 1995లో నందిని అనే అమ్మాయి తో పెళ్లి జరిగిన తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు.ఆతర్వాత 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
బద్రి సినిమాతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేణు దేశాయి గారిని పరిచయం చేశాడు.
బద్రి సినిమా హిట్ అవడంతో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ల మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడి ఇద్దరూ కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేశారు.
అయితే రేణు దేశాయ్ మొదట్లో మోడలింగ్ చేసేది అలా మోడలింగ్ చేస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ బద్రి సినిమా లో హీరోయిన్ కోసం వెతుకుతుండగా ఒక సాంగ్ లో రేణుదేశాయ్ గారిని చూసి ఈమె అయితే బద్రి సినిమా కి సెట్ అవుతుంది అనుకొని ఆమెని కలిసి కథ చెప్పి ఒప్పించాడు అలా పూరి జగన్నాథ్ రేణు దేశాయ్ ని తెలుగు తెరకు పరిచయం చేశాడు.అయితే రేణుదేశాయ్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసింది.
అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేసిన బద్రి సినిమా తర్వాత తను వేరే సినిమాలు చేయలేదు.కానీ ఖుషి సినిమా హిట్ అవడంతో పవన్ కళ్యాణ్ తన సొంత డైరెక్షన్ లో చేసిన జానీ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
కొన్ని రోజుల పాటు ఇద్దరు సహజీవనం చేసిన తర్వాత అఖిరా నందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటి భార్య నుంచి విడాకులు రావడంతో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.
బొమ్మరిల్లు భాస్కర్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన ఆరెంజ్ సినిమాకి ప్రొడ్యూసర్ నాగబాబు కావడంతో ఆ సినిమా బడ్జెట్ ఎక్కువై పోవడంతో సినిమా యావరేజ్ గా నడిచినప్పటికీ సినిమాకి డబ్బులు పెద్దగా రాలేదు దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబు సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ డబ్బు సహాయం చేశాడు అని దాని వల్లే రేణుదేశాయ్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి.దాంతో ఇక మీదట నువ్వు ఎవరికీ డబ్బులు సహాయం చేయకూడదని రేణుదేశాయి పవన్ కళ్యాణ్ ని కోరగా పవన్ కళ్యాణ్ సహాయం కోసం వచ్చిన వారిని ఊరికే పంపకూడదు ఎంతో కొంత సహాయం చేయాలి అని చెప్పాడట.దాంతో అందరికీ ఇచ్చుకుంటూ పోతే చివరికి మనకేం మిగులుతుంది అని రేణు దేశాయ్ అతన్నుంచి విడి పోయిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.
అయితే ప్రస్తుతం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి వాళ్ల పిల్లలు అయినా అఖీరా , ఆధ్యా లని పెంచుతూ వాళ్ళ బాగోగులు చూసుకుంటుంది.పవన్ కళ్యాణ్ వాళ్లకు దూరంగా ఉన్నప్పటికీ అకీరా గాని ఆధ్యా గాని బర్త్డే లు జరిగినప్పుడు పార్టీ కి అటెండ్ అవుతూ ఉంటాడు.
పవన్ కళ్యాణ్ తర్వాత తీన్మార్ సినిమాలో హీరోయిన్ అయిన అన్న లెజాహనేవా నీ పెళ్లి చేసుకున్నారు వీళ్ళ కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే రేణుదేశాయ్ మాత్రం అకీరా అధ్యలని చూసుకుంటూ మరాఠి లో సినిమా డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు.ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయి గారిని ఫ్యూచర్ లో అఖిరా కూడా హీరో అవుతాడా అని అడిగితే ఏమో వాడి కి ఏది ఇంట్రెస్టు ఉందో తెలియదు, ఒక రోజు వచ్చి క్రికెటర్ అవుతా అంటాడు, ఒకరోజు హీరో అవుతాను అంటాడు చూద్దాం ఫ్యూచర్లో వాడు ఏం చేస్తాడో అని చెప్పుకొచ్చారు.