నిన్న ఏపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోసాని కృష్ణ మురళి.పవన్ కళ్యాణ్ కి గుడి కట్టిస్తా అంటూ ఒక చాలెంజ్ విసరటం తెలిసిందే.
ఇండస్ట్రీకి 16సంవత్సరాల పంజాబీ అమ్మాయి ఎన్నో ఆశలతో తెలుగు వాళ్ళు మంచి వాళ్ళని ఇక్కడికి వచ్చింది.ఒక ప్రముఖ వ్యక్తి ఆ అమ్మాయికి అవకాశాలు ఇప్పిస్తానని.
చివరాఖరికి కడుపు చేసి, బెదిరించి అబార్షన్ చేయించి.డబ్బులు ఇచ్చి.
నోరు మూసేశారు.ఆ అమ్మాయి మానసికంగా ఇప్పుడు ఎంతో నలిగిపోయి ఉంది.
నీకు ఆడవాళ్ళ అంటే ఎంతో గౌరవం.కాబట్టి అమ్మాయికి న్యాయం చెయ్, నీకు అమ్మాయి పేరు వివరాలు రహస్యంగా పంపుతానని పోసాని నిన్న కామెంట్లు చేశారు.
దీంతో సోషల్ మీడియాలో ఆ పంజాబీ అమ్మాయి ఎవరు అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.పోసాని మీడియా సమావేశం అనంతరం సోషల్ మీడియాలో “జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్” అనే హాష్ ట్యాగ్ కూడా కూడా ట్రెండింగ్ అయ్యింది.
ఆ పంజాబీ అమ్మాయిని మోసం చేసిన వ్యక్తిని జైల్లో పెట్టించాలి, సిబిఐ చేత విచారణ చేయించాలి.ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో బయట పడాలి బాధితురాలికి న్యాయం జరగాలి.
అని డిమాండ్ చేస్తూ.ఆ హాష్ ట్యాగ్ నీ.నెటిజనులు వైరల్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో.
మీడియా సమావేశం నిర్వహించిన పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ అభిమానులు తన భార్యపై.ఇష్టానుసారం అయిన మెసేజ్ లు పెడుతున్నారు అని.విమర్శలు చేశారు.అంతేకాకుండా ఫోన్ కి వస్తున్న అసభ్యకరమైన మెసేజ్ లు మీడియా ప్రతినిధులకు చూపించారు.
ఇంట్లో పనిమనిషి తో అక్రమ సంబంధం ఉన్నట్లు పవన్ ఫ్యాన్స్ ఇష్టానుసారం అయిన మెసేజ్లు కామెంట్ చేస్తున్నారని పోసాని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే సమాజంలో ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గురించి తాను ప్రశ్నించడంలో తప్పు లేదని, పవన్ లా నా భార్య శీలం పోగొట్టుకోలేదు, ఆమె ఎంతో విలువలు కలిగిన వ్యక్తి అని.తన భార్య తన తో ఒక స్నేహితురాలి లాగా ఉంటుందని అటువంటి ఆవిడ పై మీ అభిమానుల చేత.ఇష్టానుసారం అయిన బూతులు తిట్టిస్తావా అంటూ మీడియా ముఖంగా పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంజాబీ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా.? అబార్షన్ కి డబ్బులు ఇచ్చి పంపించ లేదా.? ఆ అమ్మాయి నోరు మూయించే లేదా.? .నువ్వు ఒక బ్రోకర్ గాడివి, లోఫర్ గాడివి, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసే నువ్వు మా ఇళ్లలో ఆడవాళ్లపై.విమర్శలు చేస్తావా.??, ఎందుకు నువ్వు రాజకీయాల్లోకి రావడం.?, సినిమాలో డబ్బులు సంపాదించుకోవచ్చు కదా.రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు వచ్చిన సమయంలో ఆయన నీ విమర్శించారు.కానీ ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
రాజకీయాల్లో ఉండాల్సిన హుందాతనం అంటే అది.అసలు నీ బతుకుకి హుందాతనం.తెలుసా అంటూ మీడియా ప్రెస్ క్లబ్ లో… పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో ఎంతో మంది ఆడవాళ్లపై నువ్వు ఈ రకంగానే వ్యవహరించావు, నేను ఎప్పుడు నీ వ్యక్తిగత విషయాల్లో కలుగజేసుకొలేదు.
కానీ నా ఇంటి తలుపు తట్టావు, మా ఇంట్లో ఆడవాళ్ళ విషయాలు.టచ్ చేసావు.ఇంకా ఊరుకునే ప్రసక్తి లేదు.బాధ కలిగి ఈ మాటలు చెబుతున్నా అంటూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో.పోసాని తన ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకోసారి తన ఇంట్లో ఆడవాళ్ళ గురించి పల్లెత్తు మాట మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని.
మీ అభిమానులను కంట్రోల్ లో పెట్టుకోవాలని.పవన్ కి పోసాని వార్నింగ్ ఇచ్చారు.