వారాహి యాత్ర ( Varahi Yatra )మొదటి మూడు విడతలలో రెట్టించిన ఉత్సాహంతో అధికార వైసీపీపై( YCP ) సమర శంఖం మోగించిన జనసేన అధ్యక్షుడు తన నాలుగో విడత కృష్ణాజిల్లాలో జరిగిన వారాహి యాత్రలో మాత్రం ఒకింత అసహనానికి లోనవుతున్నట్లుగా ఆయన ప్రసంగ ధోరణి చూస్తుంటే అర్థమవుతుంది.ముఖ్యంగా ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టడం, జగన్( jagan ) కేంద్రంగా పసలేని విమర్శలు చేయడం ఆయనలోని అసహనాన్ని బయటపేడుతుంది.
మిత్రపక్షం తెలుగుదేశానికి న్యాయస్థానంలో ఊరట దక్కకపోవడం దాంతో ఉమ్మడి కార్యాచరణ ఆలస్యం కావడం మరోపక్క జనసైనికులు తెలుగుదేశంతో పొత్తుపై పూర్తిస్థాయి సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం గ్రౌండ్ లెవెల్ లో ఆ ప్రభావం కనిపించడం పవన్ లో అసహనాన్ని కలిగిస్తున్నట్లుగా తెలుస్తుంది.
మరోపక్క కేంద్రస్థాయిలో ఎన్డీఏ ( NDA )నుంచి జనసేనకి ఏ విధమైన మద్దతు దక్కకపోవడం ప్రభుత్వ అధినేత జగన్ కు మాత్రం అడిగినదే తడవుగా అపాయింట్మెంట్ లు లభించడంతో పొత్తు ధర్మాన్ని పాటించలేని మిత్రుల పట్ల ఆయన కోపం ఆయన ప్రసంగాల్లో బయటపడుతున్నట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా ప్రభుత్వ విధానాలలోని లోటుపాట్లను ఎండగట్టాల్సిన స్తానే ఎమ్మెల్యేలను మంత్రులను బెదిరించే విధంగా పవన్ మాట్లాడటం, తమ ప్రభుత్వం వచ్చాక అంతు చూస్తాను అన్నట్లుగా బెదిరింపు దొరణి లో వ్యాఖ్యలు చేయటం ఆయన అసహనానికి అర్థం పడుతున్నట్లుగా తెలుస్తుంది.ఇదంతా పరిస్థితులు తాను అనుకున్నట్లుగా కదలటం లేదన్న విసుగు తో పాటు ఎక్కడికక్కడ అధికారపక్షం అత్యంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడంతో భవిష్యత్తు కార్యాచరణ పై పవన్‌కు స్పష్టత లోపిస్తున్నట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అందుకే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేసాం అన్న తరహా వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనంగా కొంతమంది చూపిస్తున్నారు.పవన్ నాలుగో విడత యాత్రలోని ప్రసంగాలపై సామాన్య జనం నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది.తమ కార్యకర్తలను అనవసరమైన కేసుల్లో ఇరికిస్తున్నారన్న ఆవేదనలోంచి పవన్ అలా మాట్లాడారని కొంతమంది పవన్ వాఖ్యలను సమర్థిస్తుంటే మరి కొంత మంది మాత్రం ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత హోదాలో పవన్ మాట్లాడటం లేదని రాజకీయాల్లో బెదిరింపులు అభిలషణీయం కాదంటూ కొంతమంది వాఖ్యనిస్తున్నారు
.