ఏపీలో కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిపోతున్నాయి.మానవత్వ విలువలు మర్చిపోయి మృగాలా వ్యవహరిస్తున్నారు.
చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాపిన ముసలి వాళ్ళపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటన మరవక ముందే తాజాగా మరో ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
ఒకవైపు తల్లితో సహజీవనం చేస్తూనే మరోవైపు కూతురిపై కన్నేశాడు.ఎవరూ లేని సమయం చూసి ఆమెను లొంగదీసుకున్నాడు.అంతేకాకుండా ఆమెను బెదిరించి అత్యాచారం చేశారు.కూతురు ఈ విషయం తల్లికి చెప్పినా పెడచెవిన పెట్టారు.
అయితే తల్లి ప్రియుడి మోజులో పడి కన్నకూతురి మాటలు పట్టించుకోలేదు.ఆ బాలిక దిశ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించింది.
ఈ అమానుష ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తీ వివరాల్లోకి వెళ్తే.
జిల్లాలోని అర్ధవీడుకి చెందిన మహిళ ఒంగోలులోని ఓ కళాశాలలో పనిచేస్తూ గోపాల్నగర్కి చెందిన సుభాని అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తుంది.అతను ప్రియురాలితో సహజీవనం చేస్తూనే ఆమె కూతురిపై కన్నేశాడు సుభాని.
మైనర్ బాలికని బెదిరించి పశువులా మీద పడి కామకోరికలు తీర్చుకున్నాడు.ఇంటికి వచ్చిన తల్లికి తనపై జరిగిన దారుణాన్ని చెప్పుకున్నప్పటికీ బాధితురాలకి నిరాశే ఎదురైంది.
బాధితురాలు తల్లి ప్రియుడి మోజులో పడి కన్నకూతురి మాటలు పెడచెవిన పెట్టింది.ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడని చెప్పినా పట్టించుకోలేదు.దీంతో బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లి తలదాచుకుంది.తనకు న్యాయం చేయాలని కోరుతూ దిశ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.