చిత్రం : ఒక మనసు
బ్యానర్ : మధుర ఎంటర్‌టైన్‌మెంట్, TV9
దర్శకత్వం : రామరాజు గొట్టిముక్కుల
నిర్మాత : మధుర శ్రీధర్, కృష్ణ భట్ట, అభినయ్
సంగీతం : సునీల్ కశ్యప్
విడుదల తేది : జూన్ 24, 2016
నటీనటులు : నాగ శౌర్య, నిహారిక కొణిదెల, రావు రమేష్ తదితరులు
తెలుగు సినిమా వరకు తీసుకుంటే, సినీకుటుంబం లోంచి కథానాయిక రావడం చాలా అరుదుగా చూస్తుంటాం.ఇప్పుడున్న గ్లామర్ ట్రెండ్ లో ఇది ఇంకా కష్టమైపోయింది.
ఇలాంటి సమయంలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి తొలి సినీ వారసురాలిగా పరిచయమయ్యింది కొణిదెల నిహారిక.మరి తన తొలి సినిమా ఒక మనసు, ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందో లేదో చూద్దాం.
కథలోకి వెళ్తే …
డాక్టర్ సంధ్య (నిహారిక), సూర్య (నాగ శౌర్య) రెండు భిన్నమైన ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులు.వైద్యవృత్తిలో ఉన్న ఒక మామూలు అమ్మాయి సంధ్య, ఒక చిన్న రాజకీయ నాయకుడు (రావు రమేష్) కొడుకు సూర్య.
సూర్యకి తండ్రి అంటే చాలా ఇష్టం.తన కోరిక మేరకు ఎమ్మెల్యే గా ఎదగాలనేది సూర్య కల.అందుకోసం మామూలుగా రాజకీయ నాయకులు చేసే పనులన్ని చేస్తూ ఉంటాడు.సంధ్య, సూర్య .ఇద్దరు ప్రేమలో పడతారు.
సూర్య ప్రొఫెషనల్ లైఫ్ మీద సంధ్యకి బెంగగా ఉంటుంది.
ఇలాంటి సమయంలో ఒక సెటిల్మెంట్ విషయంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి జైలుకి వెళతాడు సూర్య.
జైలునుంచి తిరిగొచ్చిన సూర్యకి తండ్రి, ప్రేయసి .ఇద్దరిలోంచి ఒక్కరి ప్రపంచాన్ని ఎన్నుకోవాల్సిన చిక్కు వచ్చిపడుతుంది.సూర్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ తరువాత కథ ఎలాంటి మలుపులు తీసుకుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన గురించి
నాగశౌర్య ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించాడు.సెకండాఫ్ లో మాత్రం శౌర్య కొన్ని ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు.ఒవరాల్ గా శౌర్య కెరీర్లో చెప్పుకొదగ్గ అభినయం ఈ సినిమాలో ఉంది.ప్రేక్షకులు ఊహించినదానికి భిన్నంగా ఒక బరువైన పాత్రలో కనిపించింది నిహారిక.
అందంగా, సింపుల్ గా స్క్రిన్ ప్రెసెన్స్ బాగుంది.అయితే మొదటి సినిమా కావడంతో, ఈజ్ కనబడలేదు.
అదీకాకుండా, మనం టీవిలో, యూట్యూబ్ లో చూసిన నిహారికకు, ఈ పాత్రకు చాలా తేడా ఉండటంతో, కాస్తంత నాటకీయంగా అనిపిస్తుంది పాత్ర.
రావు రమేష్ మళ్ళీ తనదైన శైలిలో మెరిసిపోగా, ప్రగతి కాస్త సహనాన్ని పరీక్షీస్తుంది.
మిగితా పాత్రధారుల్లో శ్రీనివాస్ అవసరాల మెప్పిస్తాడు.
సాంకేతికవర్గం పనితీరు
సునీల్ కశ్యప్ అందించిన సంగీతం వినసొంపుగా, ప్రశాంతంగా ఉంది.
కమర్షియల్ సినిమా కాకపోవడం వలన ఈ చిత్రం యొక్క సంగీతం అందరికి చేరువ కాకపోవచ్చు కాని, సంగీత ప్రియులు కొంతకాలం వరకు సంగీతం కోసం ఈ సినిమాను గుర్తుపెట్టుకుంటారు.పాటలు వినడానికి ఎంత బాగున్నాయో, చూడడానికి కూడా అంతే అందంగా ఉన్నాయి.
పాటలవరకే కాకుండా, సినిమా మొత్తం అందంగా చూపించిన కెమెరా డిపార్టుమెంటు ప్రశంసలకు అర్హులు.
ఎడిటింగ్ దారి తప్పింది.
కాని పోయెటిక్ సినిమాలకు ఎడిటర్ అభిప్రాయలు పెద్దగా పరిగణలోకి రావని చెబుతూ ఉంటారు.మాటలు బోర్ కొట్టిస్తాయి.
విశ్లేషణ :
హాలివుడ్ లో ఉండే పోయెటిక్ సినిమాల పట్ల ఆసక్తి చూపేవారు ఈ సినిమాను ఓపికతో చూడొచ్చు.మంచి ప్రయత్నమైనా, సినిమా బాగున్నా, నరేషన్ చాలా అంటే చాలా స్లోగా ఉండటంతో, మల్టిప్లెక్స్ ఆడియేన్స్ కి తప్ప, మిగితా ప్రేక్షకులకి అంతగా ఎక్కకపోవచ్చు.
సెకండాఫ్ ఫర్వాలేదు.క్లయిమాక్స్ చాలా బాగా వచ్చింది.కాని ఫస్టాఫ్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదాని మీదే సినిమా భవిష్యత్తు ఆధారిపడి ఉంది.మాస్ ప్రేక్షకులకి కావాల్సిన అంశాలేవి లేకపోవడం, బిజినెస్ పరంగా పెద్ద మైనస్ పాయింట్.
క్లాస్ ప్రేక్షకులైనా, స్లోగా సాగే సినిమాలు ఇష్టపడేవారు మాత్రమే ఈ చిత్రాన్ని మోయాలి.యువత కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు.
హైలైట్స్ :
* కొత్తరకం ప్రేమకథ
* మ్యూజిక్
* క్లయిమాక్స్
డ్రాబ్యాక్స్ :
* ఫస్టాఫ్
* స్లో నరేషన్
* ఆకట్టుకోని సంభాషణలు
* హీరోహీరోయిన్ల మధ్య ఎక్కువైపోయిన సన్నివేశాలు
చివరగా :
ఓపిక చాలా అవసరం
తెలుగుస్టాప్ రేటింగ్ : 2.25/5