ఎన్టీఆర్‌ అమెరికా నుండి వెంటనే రావడానికి కారణం ఏంటో తెలుసా?

ఆస్కార్ అవార్డు వేడుకలు పాల్గొన్న ఎన్టీఆర్ ( NTR ) అందరి కంటే ముందే హైదరాబాద్ చేరుకున్నాడు.నేడు తెల్లవారు జామున హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన ఎన్టీఆర్ కి ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు.

 Ntr Came Back To Hydrabad From America Details, Ntr , Ntr30, Ram Charan, Ntr Osc-TeluguStop.com

హాలీవుడ్ ప్రముఖులతో ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.అంతే కాకుండా ఆస్కార్ వేడుక కు వెళ్లి వచ్చిన తెలుగు స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా నిలిచాడు.

అందుకే నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులంతా కూడా ఎన్టీఆర్ విషయం లో గర్విస్తున్నారు.చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా అమెరికా లోనే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎన్టీఆర్ మాత్రం ఎందుకు అప్పుడే హైదరాబాద్ కి ఎందుకు తిరిగి వచ్చారు అనేది ప్రస్తుతం చర్చ కి తెర లేపింది.

ఇంతకీ ఎన్టీఆర్ హైదరాబాద్ కి( Hyderabad ) ఇంత త్వరగా ఎందుకు వచ్చారంటే మరో వారం రోజుల్లో కొరటాల శివ( Koratala siva ) దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా చిత్రీకరణ ప్రారంభించాల్సి ఉంది.అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు జరగబోతున్నాయి.అంతే కాకుండా సినిమా కోసం ఫోటో షూట్ నిర్వహించనున్నారు.అందుకే ఎన్టీఆర్ చాలా ముందుగా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడనే సమాచారం అందుతోంది.ఈ నెలలో రామ్ చరణ్ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు లేవు.

అందుకే ఆయన ఇప్పటి వరకు అమెరికాలోనే ఉన్నాడని తెలుస్తోంది.ఇక రాజమౌళి కీరవాణి కూడా త్వరలోనే అమెరికా నుండి హైదరాబాద్ రాబోతున్నారు.ఎన్టీఆర్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆ వెంటనే షూటింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ 30 సినిమా లో అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube