భారతదేశంలో ప్రవాసులు పెట్టుబడులు పెట్టడం గత కొంతకాలంగా పెరుగుతూ వస్తోంది.ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు.
కరోనా విజృంభణ తర్వాతనే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెరుగుదల అనేది కనిపించడం ప్రారంభమైంది.కరోనా తర్వాత భారత దేశంలో ఒక సొంత ప్రాపర్టీ అనేది ఉండాలనే భావన చాలామంది ఎన్నారైలలో కలిగింది.
అందుకే ఇండియాలో ఆస్తులను సొంతం చేసుకోవాలనే ఆకాంక్ష వీరిలో పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి.ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు పరుగులెడుతున్నట్లు కూడా సూచనలు కనిపిస్తున్నాయి.ఈ పరిస్థితులలో ఇండియాలో ఎంతో కొంత ప్రాపర్టీ కొనుగోలు చేయాలని వారి భావిస్తున్నారు.
అలాగే ఒక డాలర్ పెడితే ఇండియాలో రూపాయలు వస్తున్నాయి వాటితో వారు చౌకగానే ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేయగలుగుతున్నారు.రియల్ ఎస్టేట్‌లో పెరిగిన విదేశీ పెట్టుబడుల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది.
మరింత రియల్ ఎస్టేట్ అభివృద్ధి, నిర్మాణ ప్రాజెక్టులు జరుగుతున్నందున, కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది.రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే ఎన్‌ఆర్‌ఐలు వస్తువులు, సేవలకు డిమాండ్‌ను పెంచడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చవచ్చు, ఇది మరింత ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది.రియల్ ఎస్టేట్ అభివృద్ధి పెరగడం వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి పెరుగుతుంది, ఇది ప్రజా సేవలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
ఇకపోతే, 2019 నివేదికల ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్ఆర్ఐ కొనుగోళ్లు 11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.కాగా మూడు సంవత్సరాల తర్వాత అంటే 2022లో కొనుగోళ్లు దాదాపు 14-15 బిలియన్ డాలర్లకు పెరిగింది.