బ్రిటీష్ కొలంబియాలో ఎన్నారై జర్నలిస్టుకు చేదు అనుభవం..

NRI Journalist Sameer Kaushal Attacked By Khalistan Supporters In Canada Details, Pro-Khalistan, Khalistan Supporters, NRI Journalist, Canada Journalist, Surrey, Indian High Commissioner, Sameer Kaushal, Khalistan, Canada Nri Journalist, Nri Journalist Sameer Kaushal

బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో( Surrey ) భారత హైకమిషనర్ పర్యటనను కవర్ చేయడానికి వెళ్లిన ఎన్నారై జర్నలిస్టుకి( NRI Journalist ) చేదు అనుభవం ఎదురయింది.కెనడాకి ( Canada ) చెందిన ఈ ఎన్నారై జర్నలిస్టును ఖలిస్థాన్ ( Khalistan ) అనుకూల మద్దతుదారుల బృందం బెదిరించింది.

 Nri Journalist Sameer Kaushal Attacked By Khalistan Supporters In Canada Details-TeluguStop.com

అంతేకాదు అతనితో అసభ్యంగా ప్రవర్తించింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో బాధిత ఎన్నారై షేర్ చేశారు.

ఆ ఎన్నారై పేరు సమీర్ కౌశల్. సమీర్ నిరసనకారులు అవమానకరమైన, ఇబ్బందికరమైన పదాలను ఉపయోగిస్తున్నారని ట్విట్టర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

హింసాత్మక నిరసన కొనసాగుతున్నా సర్రే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) జోక్యం చేసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నిరసనలను ఆపడానికి బదులుగా వారు కౌశల్‌ను అక్కడినుంచి వెళ్లగొట్టారు.తన సొంత భద్రత కోసం అక్కడినుంచి వెళ్ళిపోవాలని సలహా ఇస్తూ వారు కౌశల్‌ను కాస్త బలవంతంగా తరలించారు.ఈ దృశ్యాలన్నీ సమీర్ షేర్ చేసిన ట్విట్టర్ వీడియోలో కనిపించాయి.

ఖలిస్తానీ మద్దతుదారుల అగౌరవ చర్యను నిరసిస్తూ లండన్‌లోని భారత హైకమిషన్ ముందు పెద్ద ఎత్తున కొందరు గుమిగూడారు.వీరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజం నుంచి మద్దతు లభించింది.

ఇకపోతే కొద్ది రోజుల క్రితం ఆందోళనకారులు లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఎగురుతున్న భారతీయ జెండాను తీసివేశారు.దీనికి బాధ్యులైన వారిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.మరోవైపు భారత అధికారులు ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్, హైకమిషనర్ నివాసం ముందు బాహ్య భద్రతను తొలగించారు.ఇక వేర్పాటువాద ఖలిస్తానీ మద్దతుదారులపై చర్య తీసుకోవాలని భారతీయ సమాజం డిమాండ్ చేస్తోంది.

వారిపై చర్యలు తీసుకోవాలని లండన్ మేయర్ సాదిక్ ఖాన్, బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube