బండికి న్యాయం అందని ద్రాక్షేనా ?

తెలంగాణలో భాజాపాకు ఒక కొత్త జోష్ తెచ్చిన వ్యక్తిగా బండి సంజయ్ ( Bandi Sanjay )గుర్తింపు పొందారు .ముఖ్యంగా విలేకరుల సమావేశాలు ,పత్రికా ప్రకటనలకే పరిమితమైన చాలామంది అధ్యక్షులు లాగా కాకుండా గ్రౌండ్ లెవెల్ లో దిగి పోరాటాలు చేసే మాస్ లీడర్ గా బండి సంజయ్ పేరు సంపాదించారు .

 No Justice For Bandi , Bandi Sanjay, Bjp Party, Telangana Policies, Brs Party, R-TeluguStop.com

నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి ఉత్తేజం కలిగిస్తూ దిశా నిర్దేశం చేస్తూ పార్టీని శరవేగం గా ముందుకు తీసుకువెళ్లడంలో బండి తనవంతు పాత్ర పాత్ర పోషించారు .అయితే ఒక మంచి టీచర్ ఒక మంచి ప్రిన్సిపాల్ కాలేడన్నట్టుగా కార్యకర్తలకు మంచి నాయకుడిగా వ్యవహరించినప్పటికీ నాయకులను కలుపుకోవడంలో మాత్రం బండి సంజయ్ విఫలమయ్యారని అంటారు.

Telugu Arvind, Bandi Sanjay, Bjp, Brs, Raghunandan, Telangana-Telugu Political N

ముఖ్యంగా భాజపా( BJP party ) లో కీలక నాయకులు అయిన అరవింద్ వర్గాన్ని రఘునందన్( Raghunandan ) వర్గాన్ని కలుపుకుపోవడంలో బండి విజయం సాధించలేదంట.అంతేకాకుండా ఈటెలతో మంచి సంబంధాలు లేకపోవడం తో ఎవరికి వారుయమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడంతో భాజపా ఒక స్థాయి నిస్తేజం ఆవరించింది.దీనిని గమనించిన అధిష్టానం దిద్దుబాటు చర్యల పేరుతో చాలా మార్పులు చేసింది.అసంతృప్తితో ఉన్న చాలామంది నాయకులకు పదవులు ఇచ్చి పరిస్థితులను చక్కబట్టాలని చూసింది.దీనిలో భాగంగానే అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించింది .అయితే ఈ నిర్ణయం తెలంగాణలోని మెజారిటీ కార్యకర్తలకు రుచించలేదు.పార్టీ కోసంకష్టపడిన బండి సంజయ్ ను పక్కన పెడితే తప్పు సంకేతాలు వెళ్తాయని వారు భావించారు.

Telugu Arvind, Bandi Sanjay, Bjp, Brs, Raghunandan, Telangana-Telugu Political N

అయితే రాష్ట్ర నాయకత్వం నుంచి తప్పించినప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో మంచి స్థానంతో బండి సంజయ్ ని గౌరవిస్తుందని అందరూ అంచనా వేశారు.ఆర్ఎస్ఎస్ మూలాలు కూడా బండి సంజయ్ కి ఉండడంతో ఆయనకు మంత్రి యోగం కచ్చితంగా పడుతుందని వార్తలు వచ్చాయి అయితే జాతీయ నాయకత్వం మాత్రం బండి కి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో సరిపెట్టింది త్వరలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి బాధ్యతలు కూడా అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది అయితే పార్టీకి తాను అందించిన సేవలను అధిష్టానం తగువిధంగా గుర్తించి గౌరవించడం లేదన్న బాధ సంజయ్ లో కూడా ఉన్నప్పటికీ ఆయన ప్రస్తుతం నిబద్ధతగల కార్యకర్తలాగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube