పటేల్ పుట్టినరోజు సందర్బంగా ఆవిష్కరించబోతున్న 'ఐక్యతా విగ్రహం' వెనకున్న 9 ఆసక్తికర విషయాలివే.!

నర్మదా నది మధ్యలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ నేడు ఆవిష్కరించబోతున్నారు.పటేల్ జయంతి రోజున విగహ్రాన్ని ఆవిష్కరిస్తుండటం విశేషం.1875 అక్టోబర్ 31న గుజరాత్ లోని నాడియార్ గ్రామంలో పుట్టిన వల్లభాయ్ పటేల్ ఇంగ్లాండ్ లో బారిస్టర్ చదివారు.అహ్మదాబాద్ లో ప్రాక్టీసు మొదలు పెట్టి న్యాయవాదిగా విశేష కీర్తి ప్రతిష్టలు, ధనం ఆర్జిస్తున్న సమయంలో దేశ పరిస్థితులు ఆయను కలచివేశాయి.

 Nine Interesting Facts About Sardar Vallabhbhai Patel Statue-TeluguStop.com

పటేల్ అన్నింటికీ వదులుకొని స్వాతంత్రోద్యమంలోకి దిగారు.కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకునిగా పేరు తెచ్చుకున్నారు.స్వతంత్ర్య భారత దేశానికి తొలి ప్రధాని కావాల్సిన అర్హత ఉన్నా, గాంధీజీ నెహ్రూ వైపు మొగ్గు చూపారు.దేశ తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ శర వేగంగా పరిస్థితులను సరిదిద్దారు.

కేవలం 40 నెలలు మాత్రమే హోంమంత్రి పదవిలో ఉండి మరణించిన పటేల్ సేవలను దేశం ఆనాటికీ స్మరించుకుంటోంది అంటే అందుకు కారణం ఆయన గొప్పతనమే.

ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా చైనాలోని బుద్ధ స్ప్రింగ్ టెంపుల్ గుర్తింపు పొందింది.దీని స్థానాన్ని పటేల్ విగ్రహం భర్తీ చేయనుంది.ఆ విగ్రహం గురించి ఆసక్తికార విషయాలివి.

1.ఈ విగ్రహాన్ని సర్దార్ సరోవర్ డ్యాంకు 3.5 కి.మీ.దిగువన సాధు బెట్ వద్ద నర్మదా నది మధ్యనున్న దీవిలో నిర్మించారు.

2.ఈ విగ్రహ నిర్మాణానికి 2,12,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు.18 వేల టన్నుల రీయిన్‌ఫోర్స్‌డ్ స్టీల్, 3550 టన్నుల కాంస్యం, 6 వేల టన్నుల స్ట్రక్చర్డ్ స్టీల్‌ను వాడారు.

3.180 కి.మీ.వేగంతో గాలులు వీచినా.రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా విగ్రహాన్ని నిర్మించారు.ప్రాజెక్ట్‌కు గత వందేళ్లలో గరిష్టంగా వచ్చిన వరద ముప్పును అంచనా వేసి.దాన్ని తట్టుకునేలా పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

4.స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి 3 ఏళ్ల 9 నెలల సమయం పట్టగా.రూ.2,979 కోట్లు ఖర్చయ్యాయి.

5.ఈ విగ్రహ నిర్మాణానికి 3 వేల మంది కార్మికులు, 300 మంది ఇంజినీర్లు శ్రమించారు.ఈ విగ్రహం ఆరడుగుల ఎత్తయిన మనిషి కంటే వంద రెట్లు ఎత్తు ఉంటుంది.

6.ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ (93) అనే శిల్పి చెక్కారు.మహాత్మా గాంధీ విగ్రహాలను చెక్కడం ద్వారా ఆయన దేశవిదేశాల్లో పేరు సంపాదించారు.

ఆయన రూపొందించిన మహాత్ముడి విగ్రహాలను మన దేశంతోపాటు రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లలో ఏర్పాటు చేశారు.

7.ఆధునిక భారత దేశాన్ని ఏకం చేసిన మహనీయుడు సర్దార్ పటేల్.అందుకే ఆయన విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా మూర్తి) అనే పేరు పెట్టారు.

8.మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐక్యతా విగ్రహా నిర్మాణం ప్రారంభమైంది.ఐక్యతా మూర్తి ప్రాజెక్టు స్పూర్తిని వివరిస్తూ మన ప్రధాని చెప్పిన మాటలు ఇవి.
.భాషలు అనేకం.భావం ఒక్కటే
రాష్ట్రాలు అనేకం.

దేశం ఒక్కటే
రంగులు అనేకం.పతాకం ఒక్కటే
మాటలు అనేకం.

గొంతు ఒక్కటే
ఆచారాలు అనేకం.సంస్కృతి ఒక్కటే
సమాజాలు అనేకం.

భారత్ ఒక్కటే
పనులు అనేకం.సంకల్పం ఒక్కటే
మార్గాలు అనేకం.

లక్ష్యం ఒక్కటే
పథకాలు అనేకం.ప్రయోజనం ఒక్కటే
వ్యక్తీకరణలు అనేకం.

ప్రతిభ ఒక్కటే
అదీ ఈ ఐక్యత మూర్తి స్ఫూర్తి.

9.దురదృష్టవశాత్తు కొందరు మూర్ఖులు సర్ధార్ పటేల్ విగ్రహం విషయంలో సంకుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.ఒక కుటుంబ పేరు ప్రతిష్టల కోసం పటేల్ చరిత్రను తక్కువ చేసిన పార్టీతో పాటు కొందరు ఓర్వలేని నాయకులు, ఉన్మాదులు, విచ్చినకర శక్తులు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

దేశాన్ని ఏకం చేసిన ఒక మహానీయుని స్పూర్తిని గుర్తు చేసుకుంటూ, భావితరాలకు అందించే ఐక్యతా మూర్తికి జేజేలు పలుకుదాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube