వైవాహిక జీవితం గురించి అడిగిన నెటిజన్.. నిహారిక షాకింగ్ కామెంట్స్..!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి, సినీ ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియాలో నిహారిక చాలా యాక్టివ్ గా ఉంటూ తన టాలెంట్లను నెటిజన్లకు తెలిసేలా చేస్తుంటారు.

 Mega Daughter Niharika Konidela Shocking Comments About Married Life, Funny Answ-TeluguStop.com

బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా ప్రతిభతో నిహారిక సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.ఒకవైపు నటిగా కెరీర్ ను కొనసాగిస్తూనే నిహారిక నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.

పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నిహారిక తాజాగా వైవాహిక జీవితం గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.ఢీ డ్యాన్స్ షోకు యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన నిహారిక ఆ షోకు హోస్ట్ గా మెప్పించారు.

నిహారిక తన సొంత బ్యానర్ అయిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ పై వెబ్ సిరీస్ లను నిర్మించడంతో పాటు ఆ వెబ్ సిరీస్ లలో నటిస్తుండటం గమనార్హం.

గతేడాది నిహారిక చైతన్యల వివాహం ఘనంగా జరిగింది.

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో జరిగిన ఈ వివాహ వేడుక గురించి జోరుగా చర్చ జరిగింది.

Telugu Married, Nagabau, Netizen, Niharika, Reply-Movie

పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరైనా నాగబాబు ఖర్చుకు వెనుకాడకుండా నిహారిక పెళ్లిని గ్రాండ్ గా జరిపించారు.సోషల్ మీడియాలో ఫోటోలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం నిహారిక అభిమానులతో పంచుకోవడం గమనార్హం.

Telugu Married, Nagabau, Netizen, Niharika, Reply-Movie

తాజాగా నిహారిక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించారు.ఇందులో ఒక నెటిజన్ నిహారిక వైవాహిక జీవితం ఎలా ఉందో చెప్పాలని ప్రశ్నించగా నిహారిక భర్త చైతన్య కళ్లను మూయడంతో పాటు ఏమో సార్ నాకు కనపడదు అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.నిహారిక ఫన్నీ సమాధానాన్ని చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube