టీజర్‌ టాక్‌ః సూపర్‌ స్టార్‌ రేంజ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది

నయనతారకు లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ ట్యాగ్‌ ఉంది.ఆమెను నెటిజన్స్‌ మరియు అభిమానులు లేడీ సూపర్‌ స్టార్‌ అనడంను కొందరు తప్పుబట్టారు.

 Netrikan Movie Wil Give Real Lady Super Star Tag For Nayanatara , Lady Super Sta-TeluguStop.com

ఆ పేరుకు ఆమె అర్హం కాదు అంటూ చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.కాని వారి నోరు కూడా మూసే సినిమా రాబోతుంది.

వారంతా కూడా నయనతార లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ ఒప్పుకునే రోజు రాబోతుంది.తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన నెట్రికన్‌ సినిమా టీజర్‌ తో ఆమె నటన స్థాయి ఏంటో తేలిపోయింది.

ఆమె ఇప్పటికే ఎన్నో పాత్రలను చేసింది.కాని గుడ్డి అమ్మాయి పాత్రలో మాత్రం ఆమె కనిపించలేదు.

ఇప్పటి వరకు చేయని పాత్రలో నయన్‌ నటించబోతుంది.అందుకు సంబంధించిన పాత్రను ఇప్పుడు చేస్తున్న కారణంగా అంతా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు.

సాదారణంగా అయితే ఈమె ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాల్సి ఉంది.కాని టీజర్‌ మాత్రం తెలుగులో రాలేదు.

Telugu Lady Nayanatara, Nayanatara, Netrikan, Tamil, Telugu-Movie

నెట్రికాన్‌ సినిమా లో నయనతార కనిపించిన తీరు, ఆమె నటించిన తీరు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.ఇప్పటి వరకు అందంతో లేడీ సూపర్‌ స్టార్‌ అనిపించుకుంటుంది అంటూ కొందరు ఆరోపిస్తున్నారు.కాని ఇప్పుడు మాత్రం ఆమె నటనతో లేడీ సూపర్‌ స్టార్‌ అనిపించుకోబోతుంది అంటున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది.ఈ సినిమాను ఆమె ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ నిర్మిస్తున్న కారణంగా అంచనాలు మరింతగా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.

ఇదే సమయంలో నయన్‌ మరో రెండు సినిమాలు కూడా నటిస్తుంది.తెలుగులో ఈమె చేస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి.

అన్నింటిలోకి అంధురాలిగా నటిస్తున్న నెట్రికాన్‌ సినిమా మాత్రమే ప్రత్యేకం అనడంలో ఎలాంటి సందేమం లేదు.ఈమె లేడీ సూపర్‌ స్టార్‌ అనిపించుకునే స్థాయిలో ఆ సినిమాలో నటిస్తున్నట్లుగా ట్రైలర్‌ లోనే తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube