ఆదిపురుష్ పోస్టర్ గురించి దారుణంగా ట్రోల్స్.. అవే బాగున్నాయంటూ?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో నటించిన ఆదిపురుష్ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ కావాలని చాలామంది అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తుండగా ఈరోజు ఎట్టకేలకు ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజైంది.రాముడి లుక్ లో ప్రభాస్ ను చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 Netizens Trolling Adipurush Movie Poster Details, Adipurush Movie, Prabhas, Adip-TeluguStop.com

అయితే కొంతమంది అభిమానులు మాత్రం ప్రభాస్ లుక్ ఆశించిన విధంగా లేదని కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ పోస్టర్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు ఎంతో బాదున్నాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొంతమంది దర్శకుడు ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు.రిలీజ్ చేసిన పోస్టర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని రామ్ చరణ్ పోస్టర్ ను తలపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ కానుకగా ఆదిపురుష్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుందని బోగట్టా.

ఆదిపురుష్ రిలీజ్ కు మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.

Telugu Adipurush, Om Rout, Netizens, Prabhas-Movie

సరికొత్త టెక్నాలజీతో ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది.రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.ఆదిపురుష్ సినిమా కోసం మేకర్స్ 500 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేశారని తెలుస్తోంది.

Telugu Adipurush, Om Rout, Netizens, Prabhas-Movie

ఈ స్థాయిలో బడ్జెట్ రికవరీ కావాలంటే సినిమా హక్కులను భారీ మొత్తానికి అమ్మాల్సి ఉంది.చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారని బోగట్టా.ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధేశ్యామ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ఆదిపురుష్ తో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube