కాస్టింగ్‌ కౌచ్‌.. హీరోను గదిలోకి పిలిచి అక్కడ చేయి వేసిన దర్శకుడు!   Navajith Narayanan Opens Up About Casting Couch In Mollywood     2018-07-15   11:16:22  IST  Ramesh P

సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. కేవలం తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా హాలీవుడ్‌ రేంజ్‌ వరకు ఈ కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఉందని, కొత్తగా వచ్చే హీరోయిన్స్‌, హీరోయిన్స్‌గా ఛాన్స్‌లు కావాలనుకునే అమ్మాయిలు తమను తాము అర్పించుకున్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలరు అనే విషయం ఈమద్య అందరికి తెలుస్తుంది. అయితే కొందరు హీరోయిన్స్‌ మాత్రం ఈ మహమ్మారికి దొరకడం లేదు. అదృష్టం కలిసి వచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్‌ను దక్కించుకుంటే, ఆ తర్వాత కాస్టింగ్‌ కౌచ్‌ అవసరం రాదు. హీరోయిన్స్‌ మాత్రమే కాకుండా హీరోు కూడా కొన్ని సార్లు కాస్టింగ్‌ కౌచ్‌కు బలి అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

బాలీవుడ్‌లో ఆమద్య ఒక నటుడు అవకాశం కావాలని వెళ్తే నిర్మాత తనకు తెలిసిన ఒక లేడీ ఫైనాన్సియర్‌ కోరిక తీర్చాలంటూ డిమాండ్‌ చేశాడు. అవకాశం దక్కించుకోవడం కోసం తాను ఆ పని చేయాల్సి వచ్చిందంటూ ఆమద్య ఆ నటుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అమ్మాయిలు బయట పడ్డట్లుగా అబ్బాయిలు ఈ విషయంలో బయట పడటం లేదు. కాని అబ్బాయిలు కూడా లైంగికంగా దోచుకోబడుతున్నారు అంటూ తాజాగా మరో సంఘటనతో రుజువు అయ్యింది.

మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నవజీత్‌ నారాయణ అనే యువ హీరో ఒక దర్శకుడి నుండి అసభ్యకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడట. తన కెరీర్‌ ఆరంభ విషయాలను తెలియజేసిన సదరు హీరో అందరు విస్తు పోయే విషయాన్ని చెప్పుకొచ్చాడు. సినిమా అవకాశం ఇస్తామని, ఆఫీస్‌కు రమ్మంటూ ఒక దర్శకుడు ఫోన్‌ చేశాడు. ఆయన కథ డిష్కషన్స్‌ అంటూ రూంకు తీసుకు వెళ్లాడు. రూంలోకి వెళ్లిన తర్వాత ఎక్కడెక్కడో చేయి వేస్తూ నన్ను లైంగికంగా వేదించడం మొదలు పెట్టాడు.

ఆయన మాట్లాడుతూనే తొడమీద, ఇంకా నడుం మీద చేతులు వేస్తూ ఉన్నాడు. దాంతో నాకు కోపం వచ్చి చెంపమీద లాగి పెట్టి ఒక్కటి ఇచ్చి, అక్కడ నుండి వెళ్లి వచ్చాను. ఆ దర్శకుడు స్వలింగ సంపర్కుడు అని, గతంలో పలువురు క్యారెక్టర్‌ ఆర్టిస్టు అతడి బారిన పడ్డట్లుగా నవజీత్‌ చెప్పుకొచ్చాడు. ఆ దర్శకుడి పేరు మాత్రం ఈయన వెళ్లడి చేసేందుకు ఇష్టపడలేదు. అవకాశాల కోసం వెళ్లిన సమయంలో అబ్బాయిలకు కూడా కొన్ని సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.