ఏది ఎక్కడ ఎలా ఉపయోగించాలో రాజకీయా నాయకులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.ఓట్ల కోసం సెంటిమెంట్ ను ఆయింట్మెంట్ లా జనాలకు రాసేందు వారెప్పుడూ వెనుకా ముందు ఆలోచించరు.
ఎందుకంటే వారికి కావాల్సింది ఓట్లు రాలడమే.అందుకే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే సమయంలో ఏదో ఒక సింపతీ తో జనాల్లో తిరిగి ఓట్లు పొందేందుకు నాయకులూ , పార్టీలు పోటీ పడుతుంటాయి.
ఇప్పుడు అదే సెంటిమెంట్ తో ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేందుకు కేంద్ర అధికార పార్టీ బీజేపీ సిద్ధం అవుతోంది.
హిందువులకు ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడుడి అంశాన్ని ఓట్ల కోసం వాడేసుకోవాలని డిసైడ్ అయిపోయింది.
అందుకే ముందుగా ఆ మేరకు బయటకి వచ్చేలా కొన్ని లీకులు ఇస్తోంది.ఎన్నికల్లోగా రామమందిర నిర్మాణం ప్రారంభిస్తామనేది.ఆ లీకుల సారాంశం.నిన్న హైదరాబాద్‌కు వచ్చిన.
అమిత్ షా.ఆరెస్సెస్, వీహెచ్‌పీ నేతలతో కూడా ఇదే చెప్పారు.ఎన్నికల్లో బీజేపీ హిందూత్వ ఎజెండాను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉందన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.

బీజేపీ నేతల వ్యూహమో.మరో కారణమో కానీ.కొద్ది రోజుల కిందట.
వీహెచ్‌పీ అగ్రనేతలు.ఢిల్లీలో సమావేశమయ్యారు.
రామమందిరం అంశం సుప్రీంకోర్టు.రెండు, మూడు నెలల్లో తేల్చకపోతే.
తమ పని తాము చేసేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.అంతకు ముందే.
బీజేపీకి చెందిన కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ.రామమందిరం అంశానికి పెద్దగా ప్రాధాన్యత లేదని ఓ ప్రకటన చేశారు.
ఆ తర్వాత.హిందూ సంస్థలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
కానీ అంతా బీజేపీ నేతలు ఆడుతున్న డ్రామా అని విమర్శలు రావడంతో అప్పటికి సైలెంటయిపోయారు.
వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ వస్తే.
అయోధ్యలో రామాలయం నిర్మిస్తారమని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు.మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు.
పూర్తి మెజార్టీ వచ్చింది.అయినా పట్టించుకోలేదు.
ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ పూర్తి మెజార్టీ అనే వాదన వినిపించారు.అక్కడ కూడా పూర్తి మెజార్టీ వచ్చింది.
అటు కేంద్రంలోనూ.ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ.
బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది.కానీ ఇంత వరకూ రామాలయం నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
కోర్టుపై నెపం నెట్టి.అలా ఆలస్యం చేస్తూ ఉన్నారు.
ప్రస్తుతం ఎన్నికలు దగ్గరకు వస్తూండటంతో.అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాన్ని మళ్లీ బయటకు తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.దీని కోసం మాస్టర్ ప్లాన్ రెడీ అయిందన్న ప్రచారం జరుగుతోంది.ప్రభుత్వ పాలన.
ఇతర విషయాలు.ఎన్నికల్లో ఎజెండా కాకుండా ఉండాలంటే.
భావోద్వేగ అంశాలను వాడుకోవడమే మేలని బీజేపీ భావిస్తోంది.దీనిపై ముందు ముందు ఎటువంటి వివాదాలు చోటుచేసుకుంటాయి చూడాలి.







