Nani: 2023లో ఆ ఘనత దక్కిన హీరో నాని మాత్రమే.. మరే స్టార్ హీరోకు సాధ్యం కాలేదంటూ?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

 Natural Star Nani Rare Feat In 2023 Dasara Hi Nanna Movies-TeluguStop.com

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.అయితే ఇటీవలే దసరా సినిమాతో( Dasara Movie ) ప్రేక్షకులను పలకరించిన నాని ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.

తాజాగా కూడా శౌర్యువ్ దర్శకత్వం వహించిన హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాతో ప్రేక్షకులకు పాలకరించారు.ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నానికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే కానీ ఈ ఏడాది రెండు పూర్తి భిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు.

ఆ రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించాయి.ప్రథమార్థంలో దసరా తో మాస్ హిట్ ని, ద్వితీయార్థంలో హాయ్ నాన్నతో క్లాస్ హిట్ ని అందుకున్నాడు.

Telugu Dasara, Shouryuv, Srikanth Odela, Nanna, Nani, Nani Hits, Nani Rare, Natu

అంతేకాదు ఈ రెండు సినిమాలను డైరెక్ట్ చేసింది నూతన దర్శకులే కావడం విశేషం.నాని పూర్తిస్థాయి మాస్ అవతార్ లో దర్శనమిచ్చిన సినిమా దసరా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాతో శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకుడిగా పరిచయమయ్యాడు.మార్చి 30న విడుదలైన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.వరల్డ్ వైడ్ గా రూ.115 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది.

Telugu Dasara, Shouryuv, Srikanth Odela, Nanna, Nani, Nani Hits, Nani Rare, Natu

ఇటీవలె హాయ్ నాన్న లాంటి పూర్తి క్లాస్ సినిమాతో ఈ ఏడాది మరోసారి ప్రేక్షకులను పలకరించాడు నాని.వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాతో శౌర్యువ్( Director Shouryuv ) డైరెక్టర్ గా పరిచయమయ్యాడు.డిసెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం, దసరా స్థాయి వసూళ్లు సాధించినప్పటికీ మంచి వసూళ్లతో పది రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి, క్లాస్ హిట్ గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.ఒకే ఏడాది రెండు విభిన్న తరహా సినిమాలతో, ఇద్దరు దర్శకులను పరిచయం చేసి రెండు విజయాలను సొంతం చేసుకోవడం నానికే చెల్లింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube