సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో చిన్న లింక్ ఉంటే దాన్ని పట్టుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అని కోరుకునే వారు చాలా మంది ఉంటారు.అలాంటిది యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి దిగ్గజ హీరో బామ్మర్ధి అయినా కూడా నితిన్ నార్నె( Narne Nithiin ) ఇండస్ట్రీలో అడుగు పెట్టే విషయం లో బావ హెల్ఫ్ తీసుకోవడం లేదు.
ఆ మధ్య శ్రీశ్రీశ్రీ రాజా వారు( Sri Sri Sri Raja Vaaru ) అనే సినిమా ను చేస్తున్నట్లుగా ప్రకటించిన నితిన్ ఆ సినిమా విషయం లో ఏం జరిగిందో ఏమో కానీ పక్కన పెట్టేశారు.ఆ తర్వాత శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం లో ఒక సినిమా ను మొదలు పెట్టాడు.
కానీ అది కూడా ఇప్పటి వరకు సందడి లేదు.
అయితే అనూహ్యంగా, సైలెంట్ గా మ్యాడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు.ముగ్గురు హీరోల్లో ఒక్కడిగా నితిన్ నార్నే ఎంట్రీ ఇచ్చాడు.సింపుల్ గా ఎంట్రీ ఇచ్చినా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
దాంతో మ్యాడ్( MAD ) హీరో అంటూ నితిన్ నార్నే కి పేరు దక్కింది.మొదటి సినిమా తో పాజిటివ్ మార్కులు దక్కించుకున్న నితిన్ ఇక నుంచి అసలు సినిమా లు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.</br
తనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ ను, ఆర్థిక బలం ను ఇకపై చూపించాలని నితిన్ నార్నె కి కొందరు సూచిస్తున్నారు.నితిన్ ఇక నుంచి వరుసగా సినిమాలు కమిట్ అవ్వడం తో పాటు ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలతో వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.తన ప్రతి సినిమా కు కూడా బావ ఎన్టీఆర్ ను ఏదో విధంగా భాగం చేసి ప్రమోషన్ చేయించుకోవాలని భావిస్తున్నాడు.మొత్తానికి నార్నే బాబు ఫ్యూచర్ ప్లాన్ చాలా బిగ్ గా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.