టీడీపీ అధినేత చంద్రబాబు స్పషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో మూడో రోజు విచారణ కొనసాగుతోంది.ఈ క్రమంలో చంద్రబాబు తరపున న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ కేంద్రంగా న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి.కాగా చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని సాల్వే కోర్టుకు తెలిపారు.
సాధారణంగా జరిగే దర్యాప్తుకు రివర్స్ లో సీఐడీ విచారణ ప్రారంభించిందని పేర్కొన్నారు.అయితే హరీశ్ సాల్వే వాదనలు పూర్తయిన తరువాత ఏపీ ప్రభుత్వం, సీఐడీ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు.
ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు పూర్తయిన తరువాత సుప్రీంకోర్టు ఏం తీర్పును వెలువరిస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.