జగన్ నియంత పాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి..అంటూ నారా లోకేష్ సంచలన పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 రోజుల్లో నుండి అంగన్వాడీలు సమ్మె( Anganwadis Protest ) చేస్తున్నారు.పెరిగిన ధరలు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నారు.

 Nara Lokesh Sensational Post On Cm Jagan Over Anganwadis Protest Details, Ap Ang-TeluguStop.com

అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై టీడీపీ నేత నారా లోకేష్.( Nara Lokesh ) ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.“జగన్( CM Jagan ) నియంతపాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుంది.రాజులు, రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక తొలిసారిగా సుమారు అయిదేళ్ల క్రితం ఎపి ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే నయా నియంతకు అధికారమిచ్చారు.

ఆయన అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థల పాల్జేస్తున్నాడు.ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ 40రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే కనీస స్పందన లేకపోగా, విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలు పీకేస్తామని తన పాలేరు సజ్జలతో( Sajjala ) బెదిరింపులకు దిగుతున్నాడు.ప్రభుత్వ అనాలోచిత, మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

జగన్ అంగన్వాడీల పై ప్రయోగించిన ఎస్మా( ESMA ) ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారబోతోంది.ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్… మరో 3నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయం.ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరిపోకుండా న్యాయమైన డిమాండ్ల సాధనకు 40రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ( TDP ) సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.టిడిపి-జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని నేను మాట ఇస్తున్నాను”.

అని లోకేష్ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube