లోకేష్ మాటల్లో అర్ధాలు వేరులే! అంత తక్కువ అంచనా వేయొద్దు

ఏపీ రాజకీయాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారసుడుగా.భావి టీడీపీ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కితాబు అందుకుంటున్న లోకేష్ ని ప్రత్యర్ధి పార్టీలు పప్పు అని సంబోధిస్తూ ఉంటాయి.

 Nara Lokesh Giver Clarity To His Words On Bandar Port-TeluguStop.com

ఎక్కువగా అతని తెలివి తేటలుని ఎత్తి చూపిస్తూ, అసలు ఎ విషయాల మీద కనీస అవగాహన, అలాగే భాష మీద పట్టు లేని కుమారుడుని చంద్రబాబు అందలం ఎక్కించాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ తో పాటు, వైసీపీ నేతలు కూడా విమర్శిస్తూ ఉంటారు.సర్పంచ్ గా గెలవలేని వ్యక్తిని మంత్రిని చేసారని లోకేష్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు.

అయితే లోకేష్ మీద ప్రత్యర్ధి ప్రత్యర్ధి పార్టీలు, అలాగే సోషల్ మీడియాలో చేసే విమర్శలకి అతను ఎప్పుడు నవ్వుతూనే సమాధానం చెబుతూ ఉంటాడు.అలాగే తన భాషా పరిజ్ఞానం మీద చేసిన కూడా వాటిని తేలికగా తీసుకుంటాడు.

ఇదిలా ఉంటే ప్రత్యర్ధి పార్టీలు తనపై చేసే విమర్శలకి సమాధానం చెప్పాలని ఈ ఎన్నికలలో మంగళగిరి నుంచి లోకేష్ ఎమ్మెల్యేగా బరిలో నిలబడుతున్నాడు.ఇదిలా ఉంటే మంగళగిరిలో లోకేష్ ఎన్నికల ప్రచారంలో మాటలపై కూడా ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు చేయడం మొదలెట్టింది.

ఎన్నికలు డేట్ తప్పు చెప్పిన లోకేష్ ని విపక్షాలు ముందుగా ట్రోల్ చేయడం మొదలెట్టాయి.తరువాత బందరు పోర్ట్ ని తెలంగాణకి తరలించే ప్రయత్నం జరుగుతుందని చేసిన విమర్శలు కూడా సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి.అయితే తాజాగా తన వాఖ్యలకి లోకేష్ ఓ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చాడు.తెలంగాణలో ఓ డ్రైపోర్ట్ ఏర్పాటు చేసి, బందరు పోర్ట్ ని దానితో అనుసంధానం చేయడం ద్వారా ఇక్కడి పోర్ట్ లో వచ్చే ఆదాయం తమ రాష్ట్రానికి మళ్ళించి ఏపీని దెబ్బ తీసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని చెప్పడానికి తను ఆ రోజు ఆ వాఖ్యలు చేసానని చెప్పుకొచ్చారు.

దీనిని బట్టి లోకేష్ కి భాష మీద పట్టు లేకపోయినా మాటలలో మాత్రం అర్ధం ఉంటుందని, అతనిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube