నాని, 'అంటే.. సుందరానికీ' థర్డ్ సింగిల్ రాంగో రంగ లిరికల్ వీడియో మే 23న విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో సందడి చేస్తోంది.వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

 Nani, Ante Sundaraniki Third Single Rango Ranga Lyrical Video To Be Out On May 2-TeluguStop.com

ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ‘రాంగో రంగ’ పాట లిరికల్ వీడియోని మే 23న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాని నుదురుపై బ్యాండైయిడ్ తో తన సైకిల్‌ నిఎత్తిపట్టుని అయోమయంగా చూడటం ఆసక్తికరంగా, అదే సమయంలో సుందరం పాత్రలోని కామిక్ టచ్ ని చూపిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది.సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని.ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు.

ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube