ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి…ముఖ్యంగా నంద్యాలలో అయితే రాజకీయ వేడి మరీ ఎక్కువగా ఉందట.ఇంతకీ నంద్యాలలో ఏమి జరిగింది.
నిన్నా మొన్నటి వరకూ నంద్యాల టిడిపిలో ఉన్న సమైక్యతా రాగం ఇప్పుడు ఎందుకు మూగబోయింది.ఒక్కసారిగా టిడిపిలో అలజడులు కలగడానికి కారణం ఏమిటనే వివరాలలోకి వెళ్తే.
నంద్యాల టిడిపిలో గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా బగ్గు మంటున్నారు.టిడిపి కీలక నేత అయిన ఏవీ సుబ్బారెడ్డి త్వరలో వైసీపిలోకి వెళ్ళిపోవడం ఖాయం అనే వార్తలు ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చకి దారితీస్తున్నాయి.
రానున్న కాలంలో మరిన్ని మార్పులు నంద్యాల టిడిపిలో చూడవచ్చు అంటున్నారు సుబ్బారెడ్డి అనుచరులు.అందులో భాగంగానే సుబ్బారెడ్డి టిడిపి నుంచీ బయటకి రానున్నారని టాక్…అయితే గత కొంతకాలంగా భుమా అఖిల ప్రియకి,ఏవీ సుబ్బారెడ్డి కి అస్సలు పడటం లేదట.
అఖిల ప్రియ ఏవీ ని టార్గెట్ చేయడం.తన వ్యాపారాలలో ఇబ్బంది పెట్టడం కక్ష సాధింపు చర్యలు చేస్తోందని అందుకే ఏవీ అటువంటి పరిస్థితుల్లో ఇమడలేక పార్టీని వీడటమే మంచిదనే ఉద్దేశ్యానికి వచ్చారని టాక్.
ఏవిని వైసిపిలోకి తీసుకొచ్చేందుకు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది.అంతేకాదు ఏవీ లాంటి వ్యక్తి వైసీపిలోకి వస్తే భుమా ఫ్యామిలీ కి చెక్ పెట్టచ్చు అనేది వైసీపి ఎత్తుగడ.
అయితే వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం నుడి పోటీ చేసేందుకు టిక్కెట్టు కేటాయించాలని ఏవి అడగడంతో అదే సీటుకోసం వేచి చూస్తున్న శిల్పా చక్రపాణి ఖంగుతిన్నారట.ఒక వేళ ఏవికి శ్రీశైలం టిక్కెట్టు ఇస్తే చక్రపాణి రెడ్డి వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీ చేసేట్టు, శిల్పా మోహన్ రెడ్డికి ఎంఎల్సీ ఇచ్చి, మోహన్ రెడ్డి కొడుకును నంద్యాల ఎంపిగా పోటీ చేయించే ప్రతిపాదన కీలక నేతలు పరిశీలనలో ఉందట.
అయితే ఒకవేళ ఏవీ వైసీపి తీర్ధం గనుకా పుచ్చుకున్నట్లయితే భుమా అఖిల ప్రియా చేజేతురాలా నంద్యాల ని టిడిపి నుంచీ వైసీపి చేతిలో పెట్టినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అయితే ఏవీ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.