రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవం, తెలుగువారి అన్నగారు దివంగత నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్నారై యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో వర్ధంతి కార్యక్రమాన్ని వైభవంగా చేశారు.ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే మూడు అక్షరాల శక్తి, మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన్ను కొనియాడారు.
అకుంఠిత దీక్ష దక్షతలు, అంచంచలమైన ఆత్మవిశ్వాసం నిర్విరామ కృషి కఠోరమైన క్రమశిక్షణ వంటివి ఎన్టీఆర్ గారికి సరిగ్గా సరిపోయే పదాలు అని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
గలగల ప్రవహించే గోదావరి నీ పలకరించిన, బిరబిర పరుగు తీసే కృష్ణమ్మను ప్రశ్నించిన, ఉత్తుంగ తరంగా తుంగభద్రాన్ని కదిలించిన ఆ నదులన్నీ చెప్పేవి ఒక్కటే మాట యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి నేపథ్యంలో గత 9 సంవత్సరాలుగా శతజయంతి ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు జయరాం కోమటి వెల్లడించారు.స్థానిక తెలుగుదేశం నాయకుడు వెంకట కొంగటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వచ్చి ఎన్టీఆర్ గారి గురించి ప్రసంగించారు.ఇంకా చెప్పాలంటే చాలామంది ఎన్టీఆర్ గారి అభిమానులు ఆయన గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో విజయ్ గుమ్మడి, ప్రసాద్ మంగిన, హరి సన్నిధి, సతీష్ అంబటి, వీరు ఉప్పల, శ్రీని వల్లూరిపల్లి, గోకుల్ రాచరాజు, భాస్కర్ అన్నే, బెజవాడ శ్రీనివాస్, లక్ష్మణ్ పరుచూరి, కళ్యాణ్ కోట, సతీష్ బోళ్ల, భరత్ ముప్పిరాళ్ళ, సురేంద్ర కారుమంచి, వాసు బండ్ల, నవీన్ కోడాలి, సుందీప్ ఇంటూరి ఇంకా ఎంతో మంది ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ గారికి నివాళులర్పించారు.