నాగ బాబు.చిరంజీవి తమ్ముడే కాదు.
పలు సినిమాలను నిర్మించిన నిర్మాత కూడా.సినిమా ఇండస్ట్రీలో ఆయన కంటూ ఓ గుర్తింపు ఉంది.
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.అందులో కొందరు మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ఓకే ఒక్క అమ్మాయి మాత్రం హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఆమె మరెవరో కాదు నాగ బాబు ముద్దుల కూతురు నీహారిక.
ఇండస్ట్రీలో సత్తా చాటాలని వచ్చినా.అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు.
ఒకే మనసు సినిమాతో హీరోయిన్ గా తెలుగు జనాలకు పరిచయం అయ్యింది.ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది.
ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా.అవికూడా ఇలాంటి ఫలితాన్నే అందుకున్నాయి.
దీంతో మెగా అభిమానులకు సైతం ఆమె సినిమాలు పెద్దగా నచ్చలేదు.
ఇక సినిమాలకు గుడ్ బై చెప్పిన నీహారిక మూడు ముళ్లు వేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది.
గుంటూరు మాజీ ఐజీ జొన్నల గడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను పెళ్లి చేసుకుంది.వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.పెళ్లికి ముందు నుంచే ఈ జంట తెగ హడావిడి చేశారు.పాటలు, డ్యాన్సులు ఒకటా.
రెండా.ఎన్నో వేడుకలు.
ప్రతి కార్యక్రమంలో మెగా హీరోల సందడి.అమ్మాయి పెళ్లిని వారెవ్వా అనిపించేలా చేశాడు నాగబాబు.
ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నీహారికకు కట్నంగా బాగానే డబ్బు ముట్టజెప్పాడట నాగబాబు.డైరెక్ట్ పెళ్లి కొడుక్కు కాకుండా నీహారికకు దాదాపు రూ.10 కోట్ల వరకు ఇచ్చాడట.పెళ్లికి, నగలకు కలిపి మరో రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశాడట.నీహారిక పేరు మీద అల్లుడికి ఓ బంగళా కూడా ఇచ్చాడట.
మొత్తంగా కట్నం అనే పేరు లేకుండా నీహారికకు బాగానే ప్రాపర్టీ అందించాడట.అటు పెళ్లిలో నీహారికకు ఖరీదైన బహుమతులు వచ్చాయట.
మెగాస్టార్ చిరంజీవి వజ్రాల హారాన్ని అందించాడట.దాని ధర రూ.2 కోట్లు ఉంటుందట.వరుణ్ తేజ్ కూడా చెల్లి కోసం రూ.2 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ను గిఫ్టుగా ఇచ్చాడట.అటు బాబాయ్ పవన్ కూడా ఖరీదైన కారును అందించాడట.