తెలుగు దృశ్యం విలన్ తమిళ్ దృశ్యం2 హీరోయిన్

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన దృశ్యం సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో దృశ్యం మూవీ సుమ్మారు అన్ని భారతీయ బాషలలో రీమేక్ అయ్యింది.

 Nadiya To Pair Up With Kamal Haasan, Tollywood, Jeetu Joseph, Kollywood, Goutham-TeluguStop.com

ఇక చైనీస్ బాషలో కూడా రిలీజ్ అయిన మొదటి ఇండియన్ మూవీగా దృశ్యం మూవీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.

దానికి సీక్వెల్ గా గత ఏడాది జీతూ జోసెఫ్ దృశ్యం మూవీ కూడా తెరకెక్కించారు.ఇక ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని విమర్శకుల ప్రసంసలని సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మలయాళీ దృశ్యం2 తెలుగులో వెంకటేష్, మీనా కాంబినేషన్ లోనే రీమేక్ అయ్యింది.

జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే ఈ మూవీ తెరకెక్కింది.ఇక రీసెంట్ గా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Telugu Gouthami, Jeetu Joseph, Kamal Haasan, Kollywood, Meena, Nadiya, Tollywood

తెలుగులో కూడా హిట్ టాక్ సొంతం చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తుంది.ఇదిలా ఉంటే దృశ్యం మూవీని గతంలో కమల్ హసన్ తమిళ్ లో రీమేక్ చేశారు.మొదటి పార్ట్ లో కమల్ హసన్ కి జోడీగా గౌతమి నటించింది.అప్పట్లో వారిద్దరు రిలేషన్ లో ఉండటం వలన అది సాధ్యం అయ్యింది.అయితే ప్రస్తుతం కమల్ హసన్ తో గౌతమి విడిపోవడంతో పాటు అతని మీద తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది.ఈ నేపధ్యంలో దృశ్యం2 మూవీలో గౌతమిని కమల్ హసన్ తీసుకునే అవకాశం లేదు.

ఈ నేపధ్యంలో ఆమె స్థానంలో మరో నటిని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.అయితే కమల్ హసన్ భార్య పాత్ర కోసం ఇప్పుడు నదియా పేరు తెరపైకి వచ్చింది.

తెలుగులో ఆమె పోలీస్ ఆఫీసర్ గా యాంటీ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది.దానికి విరుద్ధంగా తమిళ్ దృశ్యం రీమేక్ లో కమల్ భార్యగా కనిపించబోతూ ఉండటం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube