నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో చేరే ప్రసక్తి లేదంటూ కొద్దిరోజుల క్రితమే క్లారిటీ ఇచ్చేసిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) జనసేన పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇప్పటికే జనసేనలో ( Janasena ) చేరబోతున్నట్లుగా ముద్రగడ సంకేతాలు ఇచ్చారు.
ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ వస్తోంది.దీంతో టీడీపీ, జనసేనలు కూడా సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి.
దీంతో జనసేన టిడిపిలో చేరే ఆలోచనతో ఉన్న నాయకులంతా ముందుగానే పార్టీలో చేరి సీటు రిజర్వ్ చేసుకునే పనిలో ఉన్నారు.
దీనిలో భాగంగానే ముద్రగడ కూడా అతి త్వరలోనే జనసేన లో చేరనున్నారు.ముద్రగడ ఇంకా పార్టీలో చేరకపోయినా , ఆయన చేరిన తరువాత ఏ పార్టీ నుంచి ఆయనను పోటీకి దింపాలనే విషయంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒక క్లారిటీకి వచ్చేసారట.కాకినాడ సిటీ నియోజకవర్గం( Kakinada City Constituency ) నుంచి ముద్రగడను పోటీ కి దింపాలని పవన్ ఫిక్స్ అయిపోయారట.
ఈ మేరకు జనసేన కీలక నాయకులు, కార్యకర్తలు నుంచి ఈ ప్రతిపాదన వచ్చిందట.అంతే కాకుండా, ప్రస్తుత కాకినాడ సిటీ వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని( MLA Dwarampudi Chandrasekhar Reddy ) ఓడించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.
మతంలో వారాహి యాత్రలోనూ అనేక విమర్శలు చేశారు.దీంతో వచ్చే ఎన్నికల్లో ముద్రగడను ఇక్కడి నుంచి పోటీకి దింపితే, ఆయన సరైన అభ్యర్థి అవుతారని టిడిపి కూడా భావిస్తోందట.ఈ నియోజకవర్గంలో కాపు, మత్స్యకార సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి.ప్రస్తుతం మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వనమాడి కొండబాబు టిడిపి కో ఆర్డినేటర్ గా ఉన్నారు.
ఇక ముద్రగడ, ద్వారంపూడి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ముద్రగడ కాకినాడ సిటీ నుంచి పోటీ చేసే విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.