బ్యాచ్‌లర్ సినిమాలో అదే ఎక్కువట!

అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేసినా ఎందుకో సరైన బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.దీంతో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’పై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 More Romance In Most Eligible Bachelor, Most Eligible Bachelor, Akhil Akkineni,-TeluguStop.com

ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండటంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌లు ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి.

కాగా ఈ సినిమా కథకు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా టైటిల్ చూస్తే హీరో రొమాన్స్‌కు వ్యతిరేకంగా ఉంటాడని అందరూ అనుకుంటారు.కానీ ఈ సినిమాలో హీరో చేసే రొమాన్స్‌కు ప్రేక్షకులు నోరెళ్లబెట్టడం ఖాయమని తెలుస్తోంది.

ఇక హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో చేసే సందడి మామూలుగా ఉండదట.

ముఖ్యంగా హీరోతో ఆమె చేసే రొమాన్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాతో అఖిల్ ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలువనుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube