2024 ఎన్నికలను జగన్( jagan ) ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.దీంతో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పలు సర్వేలు చేయించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా సామాజిక సమీకరణ ఆధారంగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.కొంతమందికి స్థాన చలనం మరి కొంతమందిని పక్కన పెట్టేస్తూ ఇన్చార్జిలను మార్పులు చేర్పులు చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్( MLA Vasantha Krishna Prasad ) కి వైసీపీ అధిష్టానం బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది.విషయంలోకి వెళ్తే మైలవరం ఇన్చార్జిగా శ్వర్నాల తిరుపతిరావును ఖరారు చేయడం జరిగింది.
తిరుపతిరావు( Tirupati Rao ) ప్రస్తుతం మైలవరం జడ్పిటిసి చైర్మన్ గా రాణిస్తున్నారు.దీంతో వచ్చే ఎన్నికలలో మైలవరం నుంచి తిరుపతిరావును ఎమ్మెల్యేగా బరిలోకి దింపడానికి జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో వివిధ సామాజిక వర్గాలుగా ఉన్న వారి పేర్లను ముందు పరిశీలించడం జరిగిందంట.ఈ క్రమంలో ఫైనల్ గా మైలవరం నుంచి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన తిరుపతిరావును పోటీకి దింపడానికి రెడీ కావడం జరిగిందంట.2019 ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి దేవినేని ఉమాపై గెలుపొందడం జరిగింది.ఈ క్రమంలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ నీ పక్కన పెట్టి జడ్పిటిసి గా ఉన్న తిరుపతిరావును బరిలోకి దింపటం వైసీపీ పార్టీలో సంచలనంగా మారింది.