కొడుకు పోటీ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..!!

MLA Chevireddy Bhaskar Reddy Has Given Clarity That His Son Is Going To Contest , MLA Chevireddy Bhaskar Reddy, YSRCP , YCP, Mohit Reddy, Perni Nani

వచ్చే సార్వత్రిక ఎన్నికలను వైసీపీ( YCP ) అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో వారసులకు టికెట్లు లేవని ప్రతి ఒక్కరు కష్టపడాలని.

 Mla Chevireddy Bhaskar Reddy Has Given Clarity That His Son Is Going To Contest-TeluguStop.com

జగన్ తెలియజేయడం జరిగింది.ప్రజలలో లేని నాయకులకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని కూడా హెచ్చరికలు చేశారు.

మరొక పక్క “గడపగడపకు మన ప్రభుత్వం” అనే కార్యక్రమంతో నిత్యం ఎమ్మెల్యేలు ప్రజలలో ఉండే రీతిలో టాస్క్ ఇవ్వడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను పోటీ చేయటం లేదని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Chevireddy Bhaskar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే చంద్రగిరి నుంచి తన కొడుకు మోహిత్ రెడ్డి పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో మచిలీపట్నం నుంచి పేర్ని నాని( Perni Nani ) కొడుకు పేర్ని కిట్టు బరిలోకి దిగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.అంతేకాదు ధర్మన్న ప్రసాద్ కొడుకు కూడా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలతో జగన్ బేటీ కానున్నారు.

దీంతో ఎలాగైనా వారసులని బరిలోకి దించడానికి కొందరు నాయకులు తెర వెనకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం మొదటి నుంచి వైయస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉంటుంది.

దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి( Mohit Reddy ) పొలిటికల్ ఎంట్రీకి జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఏది ఏమైనా వచ్చేసారువత్రిక ఎన్నికలలో తన కొడుకు పోటీ చేయబోతున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో సంచలనంగా మారాయి.

Video : MLA Chevireddy Bhaskar Reddy Has Given Clarity That His Son Is Going To Contest MLA Chevireddy Bhaskar Reddy, YSRCP #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube