బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన వ్యక్తి అవయవ దానం చేస్తే సుమారు ఎనిమిది మందకి అతని అవయవాలు ఉపయోగపడతాయని తద్వారా అతడు పునః జన్మ పొందుతాడని ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత అవయవదానం చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ ఆర్ ఐ జనరల్ హాస్పిటల్ లో సోమవారం జీవన్ దాన్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేషన్ సర్టిఫికెట్ కోర్స్ వర్క్ షాప్ ప్రారంభోత్సవం కు ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు .మనదేశంలో అవయవ దానం పై అందరికీ సరైన అవగాహన లేదని చనిపోయిన అనంతరం వారి మత సాంప్రదాయాల ప్రకారం అంతిమసంస్కారాలు నిర్వహిస్తున్నారు.అవయవదానం పై అవగాహన లేక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు మరోకరికి ఉపయోగపడటం లేదని , అవయవాలు దానం చేసినట్లయితే వారు చిరంజీవులు మిగిలిపోతారని మరొకరికి పునః జన్మ ఇచ్చినవారు అవుతారని ఆమె తెలిపారు.
మనదేశంలో వివిధ అనారోగ్య కారణాల వల్ల అవయవాలు దెబ్బతిని సంవత్సరానికి సుమారు ఐదు లక్షల మంది చనిపోతున్నారని అవయవ దానం పై విస్తృత అవగాహన పెంచినట్లయితే వీరందరికి పునః జీవం ప్రసాదించవచ్చని మంత్రి తెలియజేశారు.ఈ సర్టిఫికెట్ కోర్స్ ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు ఈ సర్టిఫికెట్ కోర్సు లో గవర్నమెంట్, ప్రయివేట్ హాస్పిటల్స్ ట్రాన్స్ ప్లాంట్ కోర్డినేటర్స్ మరియు ఐ సి యు లో విబాగంలో ట్రైనింగ్ పొందిన స్టాప్ నర్సులు పాల్గొనున్నారు, వీరి బ్రెయిన్ డెడ్ ఎలా నిర్దారిస్తారు? వంటి అంశాలతోపాటు తీసిన అవయవాలు వెరోక వ్యక్తి దేహంలో ఎలా అమర్చాలి వంటి అనేక అంశాలకు సంబంధించి విషయాలు సర్టిఫికెట్ కోర్సు లో తెలియజేస్తారు.భవిష్యత్ లో అవయవదానాన్ని ఓ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరారు.