నువ్వుల పంటను ఆశించే పెనుబంక, వెర్రి తెగుళ్లను నివారించే పద్దతులు..!

నూనె గింజ పంటలలో నువ్వుల పంట( Sesame crop ) ఒకటి.ఈ పంటను రెండవ పంటగా వేసవికాలంలో జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో విత్తుకొని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు.

 Methods To Prevent Penubanka And Crazy Pests That Expect The Sesame Crop , Ses-TeluguStop.com

తక్కువ వనరులు ఉండే నేలల్లో నువ్వులను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.పైగా నువ్వుల పంటకు పెట్టుబడి కూడా చాలా తక్కువ.

కాకపోతే నువ్వుల పంటను చీడపీడలు, తెగుళ్లు( Pests ) ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.తొలి దశలోనే వీటిని అరికడితే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.

Telugu Agriculture, Sesame Crop, Sesame-Latest News - Telugu

పొలంలో ఇతర పంటల అవశేషాలు లేకుండా పూర్తిగా శుభ్రం చేసి, సేంద్రియ ఎరువులను( Organic fertilizers ) వేసి పొలాన్ని కలియదున్నాలి.మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య సూర్యరశ్మి, గాలి బాగా తగిలే విధంగా కాస్త దూరంగా నాటుకుంటే మొక్కలకు వివిధ రకాల చీడపీడలు, తెగుళ్లు ఆశించే బెడద కాస్త తక్కువగా ఉంటుంది.నువ్వుల పంటకు పెనుబంక, వెర్రి తెగులు ఆశిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.పొలాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ, చీడపీడలు లేదా తెగుళ్లు ( Pests )ఆశిస్తే తొలి దశలోనే అరికట్టాలి.

నువ్వుల పంట వేసిన 25 రోజుల తర్వాత పెనుబంక పంటను ఆశించడం జరుగుతుంది.తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి ఆకులోని రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు ముడుచుకుపోయి పాలిపోతాయి.

ఆకుల వద్ద జిగురు లాంటి పదార్థం కనిపిస్తే ఆ మొక్కకు పెనుబంకా పురుగులు ఆశించినట్టే.ఒక లీటర్ నీటిలో 0.3మి.లీ ఎసిపేట్ ను ఇంతకు పిచికారి చేయాలి.

Telugu Agriculture, Sesame Crop, Sesame-Latest News - Telugu

నువ్వుల పంటకు ( Sesame Cultivation )పూత వచ్చే సమయంలో వెర్రి తెగుళ్లు పంటను ఆశిస్తాయి.కాస్త ఆలస్యంగా వేసిన నువ్వుల పంటకు వెర్రి తెగుళ్లు ఆశించే అవకాశం చాలా ఎక్కువ. ఈ తెగుళ్లు సోకితే మొక్కల్లోని ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్నీ ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు.మీటర్ నీటిలో 2 మిల్లీమీటర్ల మిథైల్ డెమేటన్ ను కలిపి పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube