మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు.ఇక తాను ఈ వయసులో కూడా తన లుక్స్ తో యాటిట్యూడ్ తో ఆకట్టు కుంటున్నాడు.
తాజాగా మెగాస్టార్ తన కొత్త మేకోవర్ తో మరోసారి మెగా ఫ్యాన్స్ మనసులు దోచుకున్నాడు.
ఈయన కొత్త లుక్ అందరిని ఫిదా చేస్తుంది.
మెగాస్టార్ తాజాగా ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పిక్ ను చేంజ్ చేయగా ఆ పిక్ లో ట్రెండీ హెయిర్ స్టైల్, గాగుల్స్ పెట్టుకుని ఖాకీ కలర్ షర్ట్ లో అదిరిపోయాడు.ఈయన ఈ పిక్ గత సినిమాల్లో లుక్స్ ను గుర్తు చేస్తుంది.
చూస్తుంటే తన నెక్స్ట్ సినిమా కోసమే మెగాస్టార్ ఈ మేకోవర్ అని తెలుస్తుంది.ఈ పిక్ ను మెగా ఫ్యాన్స్( Mega Fans ) తెగ వైరల్ చేసేస్తున్నారు.
ఇదిలా ఉండగా మెగాస్టార్ ఒకేసారి రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ రెండు సినిమాలపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.మరి మెగాస్టార్ ప్రకటించిన సినిమాల్లో మెగా 156( Mega156 ) ఒకటి.ఈ సినిమాకు ”విశ్వంభర”( Vishwambhara ) అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు సమాచారం.
కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి ( Director Mallidi Vassishta ) తెరకెక్కిస్తున్న విషయం విదితమే.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి టార్గెట్ గా ఆడియెన్స్ ముందుకు రానుంది.