న్యూయార్క్ : క్వాడ్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ.. కెనడా అంశం ప్రస్తావన

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( Dr S Jaishankar ) అమెరికాలో బిజిబిజీగా గడుపుతున్నారు.భారతదేశానికి సన్నిహిత భాగస్వాములతో మంతనాలు ప్రారంభించారు.

 Mea Jaishankar Kicks Off Intensive Bilateral Engagements In New York With Close-TeluguStop.com

భారత్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన జపాన్, ఆస్ట్రేలియా( Japan, Australia ) విదేశాంగ మంత్రులతో న్యూయార్క్‌లో సమావేశమయ్యారు.ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చించారు.

ప్రస్తుతం భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలను జైశంకర్ ప్రస్తావించారు.న్యూయార్క్‌లోని లోట్టే ప్యాలెస్ హోటల్‌లో క్వాడ్ మంత్రివర్గ సమావేశానికి హాజరైన తర్వాత జైశంకర్ ఈ ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు.

శుక్రవారం ఉదయం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యున్నత స్థాయి వారోత్సవాలలో పాల్గొనేందుకు న్యూయార్క్ చేరుకున్నారు.ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్యపై కెనడా చేసిన ఆరోపణలు దౌత్య ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

Telugu Australia, Dr Jaishankar, Hardeepsingh, Indo Pacific, Japan, Kamikwa Yoko

ఈ నేపథ్యంలో భారతదేశం( India ) తన దృక్కోణాన్ని ప్రదర్శించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది.పబ్లిక్ డొమైన్‌లో ఆరోపణలకు మద్ధతు ఇవ్వడానికి కెనడా ఎలాంటి సాక్ష్యాలను అందించలేదని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో కెనడా ట్రాక్ రికార్డ్ ఇదంటూ భారత్ ప్రపంచం ముందు వాదించేందుకు సిద్ధమైంది.సమావేశం అనంతరం జైశంకర్ ట్వీట్ చేస్తూ.మా బంధాల సానుకూల పథాన్ని గుర్తించి, వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ధిష్ట చర్యలపై చర్చించామన్నారు.ప్రాంతీయ, ప్రపంచ అంచనాల మార్పిడి ఎల్లప్పుడూ విలువైనదని జైశంకర్ పేర్కొన్నారు.

Telugu Australia, Dr Jaishankar, Hardeepsingh, Indo Pacific, Japan, Kamikwa Yoko

అంతకుముందు సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల గౌరవమే ఇండో పసిఫిక్( Indo Pacific ) ప్రాంత అభివృద్ధికి ఆధారమని క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు పేర్కొన్నారు.తీర రక్షక దళం, సముద్ర నౌకల ప్రమాదకర వినియోగం, వివాదాస్పద ప్రాంతాల సైనికీకరణ, తీర ప్రాంతాల్లో దోపిడీ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు.ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఎస్ జైశంకర్ (భారత్), కమిక్వా యోకో (జపాన్), పెన్నీ వాంగ్ (ఆస్ట్రేలియా), ఆంటోనీ బ్లింకెన్ (అమెరికా)లు న్యూయార్క్‌లో భేటీ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube