ప్రస్తుత కాలంలో కొందరికి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడమే అలవాటుగా మారింది.తాజాగా ఓ వివాహిత తన భర్తని ఎన్ని సార్లు చెప్పినా చికెన్ బిర్యాని కొని తీసుకురాలేదని క్షణికావేశానికి లోనై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే వెంకటయ్య అనే వ్యక్తి తన భార్యతో కలిసి స్థానిక నగరంలోని యూసఫ్ గూడ చెక్ పోస్ట్ పరిధిలో ఉన్నటువంటి రహ్మత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.
అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై ఓ ప్రైవేటు సంస్థలో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.అయితే వెంకటయ్య భార్యకి చికెన్ బిర్యానీ తినాలని కోరిక కలిగింది.దీంతో పలుమార్లు తన భర్త వెంకటయ్య చికెన్ బిర్యాని ని కొని తీసుకురమ్మని చెప్పేది.అయితే భార్య మాట ఖాతరు చేయని వెంకటయ్య వట్టి చేతులతోనే ఇంటికి వచ్చేవాడు.
దీంతో అతడి భార్య క్షణికావేశానికి లోనై ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది.
ఇది గమనించిన టువంటి స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం బాధితురాలిని చేర్పించారు.అయితే అప్పటికి ఆమె దాదాపుగా 70 శాతం గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి భర్త వెంకటయ్య తెలిపిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు.
అలాగే దర్యాప్తు చేపట్టారు.