ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మమతా బెనర్జీ సీరియస్ వ్యాఖ్యలు..!!

అయోధ్య రామ మందిరంలో( Ayodhya Ram Mandir ) బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో( PM Narendra Modi ) పాటు పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

 Mamata Banerjee Serious Comments On Prime Minister Modi Details, Mamata Banerjee-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఉద్వేగ భరితంగా స్పీచ్ ఇచ్చారు.ఎన్నో బలిదానాలు ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడని స్పష్టం చేశారు.

ఇకపై మన బలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.రామ్ లాల్లా ఇక నుంచి మందిరంలో ఉంటాడని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.మమతా బెనర్జీ( Mamata Banerjee ) అయోధ్యలో మోదీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.బీజేపీ( BJP ) దేశం మొత్తాన్ని కాషాయం లోకి మారుస్తుంది.ఆ పార్టీ రాముడు గురించి మాట్లాడుతుందే గాని సీతాదేవిని పట్టించుకోదు.మరి సీత సంగతి ఏమిటి.? రాముడు వనవాస సమయంలో ఆమె వెంట నడిచింది.బీజేపీ నేతలు మహిళా వ్యతిరేకులు. అందుకే సీత గురించి మాట్లాడారు” అని మమతా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

మేం దుర్గామాత ఆరాధకులం.వారు మాకు మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు అని అన్నారు.సోమవారం అయోధ్యలోని( Ayodhya ) రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన సమయంలోనే కోల్‌కతాలో సర్వమత సామరస్య ర్యాలీ నిర్వహించారు.అన్ని మతాలకు చెందినవారు కలసి సత్యాగ్రహ మార్చ్ చేపట్టడం జరిగింది.

కాళీఘాట్ లో కాళీమాత ఆలయంలో పూజ తర్వాత ఈ ర్యాలీ ప్రారంభించారు.ఈ ర్యాలీలో చర్చిలు, మసీదులు, గురుద్వారాలను మమతా బెనర్జీ సందర్శించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube