ఆ డైరెక్టర్ నే నమ్ముకున్న మాళవిక శర్మ...

సోగ్గాడే చిన్ని నా లాంటి సూపర్ హిట్ సినిమాలని తీసిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna )…ఆయన రవితేజ తో కలిసి తీసిన నేల టిక్కెట్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక శర్మ…చూడటానికి ఆమె లుక్స్ బాగానే ఉన్నప్పటికీ సినిమా ఆడకపోవడంతో ఈమె అంతగా పాపులర్ కాలేదు.అటు తర్వాత రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘రెడ్‌’ లో కూడా హీరోయిన్ గా నటించింది.ఈ మూవీ కొంత వరకు పర్లేదు అనిపించుకుంది అయిన కూడా ఆ సినిమా వాళ్ల ఆమెకి పెద్దగా ఒరిగింది ఏమి లేదని తెలుస్తుంది…ఇక తను ఈ మధ్య చేసిన ఫోటో షూట్ చేస్తుంటే తను ఎలాంటి పాత్రలైన చేయడానికి రెడీ గా ఉన్నాను అని ఇన్ డైరెక్ట్ గా డైరెక్టర్లకు హింట్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది…

 Malvika Sharma Who Believed That Director... Malavika Sharma , Kishore Tirumala-TeluguStop.com
Telugu Chiranjeevi, Coffee Kadhal, Jeeva, Kalyan Krishna, Kollywood, Malavika Sh

అయితే రెడ్ సినిమా తర్వాత ఆమె కి తెలుగులో అవకాశాలు కరువవ్వడం తో తమిళ్ లో ‘కాఫీ విత్ కాదల్( Coffee with Kadhal)’ అనే సినిమాలో నటించింది.అలాగే సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసి క భాయ్ కిసి క జాన్’ అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషింది.కానీ అవి కూడా ఈమెకు కలిసిరాలేదు… అయితే ప్రస్తుతం మళ్ళీ ఈమె తెలుగులో ఒక సినిమా చేయబోతుందంటు వార్తలు వస్తున్నాయి…అది ఏ సినిమాలో అంటే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ లో వస్తున్న ఒక మల్టీ స్టారర్ మూవీ లో సిద్దు కి జోడీగా నటించబోతుందంటు వార్తలు వస్తున్నాయి.

Telugu Chiranjeevi, Coffee Kadhal, Jeeva, Kalyan Krishna, Kollywood, Malavika Sh

అయితే ఈ పాత్ర కోసం మొదట శ్రీలీలా( Sreeleela) ను తీసుకున్నప్పటికీ ఆమె చాలా సినిమాలు కమిట్ అవ్వడం తో ఆమె డేట్స్ ఖాళీ లేవని తెలుస్తుంది ఇక దాంతో డైరెక్టర్ ఈమెని తీసుకునే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది…అయితే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఇప్పటికే నేల టికెట్ అనే సినిమా చేసింది కాబట్టి డైరెక్టర్ కూడా తన నెక్స్ట్ సినిమాలో ఈమె అయితేనే బెస్ట్ అని ఆలోచిస్తున్నట్టు గా తెలుస్తుంది…చూడాలి మరి తనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ మళ్లీ ఇంకో ఛాన్స్ ఇస్తాడో,లేదో…

 Malvika Sharma Who Believed That Director... Malavika Sharma , Kishore Tirumala-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube