లైట్ బియర్డ్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో మహేష్.. వైరల్ అవుతున్న సెల్ఫీ పిక్!

సూపర్ స్టార్ మహేష్ బాబు అందం మరొక హీరోకు ఉండదు అంటే అతియసోక్తి కాదేమో.46 ఏళ్ల వయసులో కూడా ఈయన హ్యాండ్సమ్ అండ్ యంగ్ చార్మింగ్ లుక్ తో అమ్మాయిలను ఫ్లాట్ చేస్తున్నాడు.ఈయన లుక్ కు ఫిదా అవ్వని అమ్మాయిలు లేరేమో.అంతలా తన కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో ఈయన మెస్మరైజ్ చేస్తున్నాడు.ఇటీవలే మహేష్ నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

 Mahesh Babu Selfie On Europe Road Trip Goes Viral Details, Mahesh Babu, Sarkaru-TeluguStop.com

ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుని వసూళ్ల పరంగా దూసుకు పోతుంది.

ఈ సినిమా ఇప్పటికే మూడవ వారంలోకి అడుగు పెట్టిన కూడా ఇంకా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ అవుతూ కలెక్షన్స్ బాగానే రాబడుతుంది.ఇక మహేష్ బాబు సర్కారు సక్సెస్ తర్వాత అమెరికాకు ఫ్యామిలీతో కలిసి వెళ్లి అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తున్నాడు.

తాజాగా షేర్ చేసిన ఫొటోలో మహేష్ లుక్ అందరిని మెస్మరైజ్ చేసింది.

మహేష్ తన ఫ్యామిలీతో కలిసి సెల్ఫీ దిగాడు.ఇక సెల్ఫీ పిక్ లో మహేష్ బాబు లైట్ బియర్డ్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ పిక్ ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవ్వడంతో ఆయన చార్మింగ్ లుక్ కి అంతా ఫిదా అవుతున్నారు.ప్రెసెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వెకేషన్ నుండి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube