టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా టికెట్ రేట్ గురించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు.సినిమా టికెట్ల ధరల విషయం గత కొన్ని రోజులుగా వివాదంగా మారి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ రచ్చ రచ్చ చేసారు.
టికెట్ ధరలను భారీగా తగ్గించడంతో అసలు వివాదం స్టార్ట్ అయ్యింది.టికెట్ రేట్ లను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఈ విషయంపై సినీ సెలెబ్రిటీలు ముందు నుండి సంతృప్తిగా లేరు.ఈ విషయంపై ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
కానీ ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం స్పందించలేదు.కానీ తాజాగా జగన్ సర్కారు సినీ పెద్దలతో భేటీ అవ్వాలని నిర్ణయించుకుని ఈ రోజు భేటీ అయ్యింది.
జగన్ తో పాటు సినీ పెద్దలుగా చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణ మురళి హాజరయ్యారు.ఎన్టీఆర్ కు ఆహ్వానం అందినా కూడా ఆయన హాజరు కాలేదు.
ఇక సీఎం జగన్ తో టాలీవుడ్ బృందం భేటీ ముగిసింది.
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు ఉదయం స్టార్ట్ అయిన ఈ భేటీ కొద్దీ సేపటి క్రితమే ముగిసింది.చిరంజీవి నేతృత్వం లోని బృందం సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చలు జరిపారు.సీఎం జగన్ కు సినీ పరిశ్రమ నుండి 14 విజ్ఞప్తులు చేసినట్టు జగన్ కూడా వాటికి సానుకూలంగా స్పందించినట్టు బృందం చెబుతున్నారు.
ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.ఇందులో మహేష్ బాబు మాట్లాడుతూ.ఆరు నెలలుగా సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉందని.ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చినందుకు చిరంజీవి గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నాడు.నిజానికి ఈ రోజు సీఎం జగన్ తో సమావేశం అయ్యాక చాలా పెద్ద రిలీఫ్ గా ఉందన్నాడు.ఆయన మొదటి నుండి చొరవ చూపి సమస్య పరిష్కారానికి కృషి చేసారని వివరించారు.
త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని. వారం లేదా పది రోజుల్లో ఆ శుభవార్త వస్తుందని మహేష్ చెప్పాడు.