పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ పాజిటివ్ టాక్ తో అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భీమ్లా నాయక్ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది.
క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి భీమ్లా నాయక్ మూవీకి పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.అయితే ఈ సినిమాకు స్టార్ హీరో మహేష్ బాబు కూడా రివ్యూ ఇచ్చారు.
ఇతర హీరోల సినిమాలు నచ్చితే ప్రశంసించే విషయంలో మహేష్ బాబు ముందువరసలో ఉంటారు.ఇతర హీరోలతో ఫ్రెండ్లీగా ఉండే అతికొద్ది మంది హీరోలలో మహేష్ బాబు ఒకరని చెప్పవచ్చు.
భీమ్లా నాయక్ మూవీ థియేటర్లలో రచ్చ చేస్తోందని భీమ్లా నాయక్ మూవీ ఎలక్ట్రిఫైయింగ్గా ఉండటంతో పాటు ఇంటెన్సిటీతో ఉందని మహేష్ బాబు కామెంట్లు చేశారు.రానా భీమ్లా నాయక్ సినిమాలో సెన్సేషనల్ పెర్ఫామెన్స్ చూపించాడని మహేష్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ అభినయం సినిమాలో ఫైర్ అనే విధంగా ఉందని మహేష్ చెప్పుకొచ్చారు.సినిమాలో రానా స్క్రీన్ ప్రజెన్స్ ను చూస్తుంటే తనకు మతిపోతుందని మహేష్ బాబు కామెంట్లు చేశారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.సాగర్ కె చంద్ర తన డైరెక్షన్ తో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.భీమ్లా సక్సెస్ తో అభిమానులు సంతోషిస్తున్నారు.
సోమవారం రోజున భీమ్లా నాయక్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఏ స్థాయి హిట్ అనే ప్రశ్నకు జవాబు దొరికే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.మహేష్, పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏ స్టార్ డైరెక్టర్ అయినా ఈ కాంబినేషన్ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.