పోకిరి, దూకుడు మించి సినిమా హిట్ అవుతుందన్నారు.. కృష్ణ రియాక్షన్ పై మహేష్ బాబు కామెంట్స్!

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట ఈ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు.

 Mahesh Babu On Super Star Krishna Reaction On Sarkaru Vaari Paata At Ma Ma Mass-TeluguStop.com

ఇకపోతే సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ చెప్పే ఫలితం ఎప్పుడూ తేడా కొట్టదు.మహేష్ బాబు నటించిన సినిమాలు అన్ని చూసిన తర్వాత కృష్ణ చెప్పినట్టుగానే సినిమాల్లో ఆడుతూ ఉంటాయి.

అలా కృష్ణ ఈ సారి కూడా సర్కారు వారి పాట సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్నది ముందే చెప్పేసాడు.

సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ ను తాజాగా కర్నూల్ లో సెలబ్రేట్ చేశారు చిత్రబృందం.

అయితే ఎప్పుడూ లేని విధంగా మొదటిసారిగా మహేష్ బాబు అభిమానుల కోసం స్టేజ్ మీదకు వచ్చి స్టెప్పులు కూడా వేశాడు.అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.ఒక్కడు సినిమా సమయంలో కర్నూలుకు వచ్చాను.

మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇక్కడికి వచ్చాను.అయితే రెండు రోజుల క్రితం మీ ఫంక్షన్ గురించి చెప్పారు ఇంత మంది వస్తారు అని నేను అనుకోలేదు అని తెలిపారు మహేష్ బాబు.

Telugu Mahesh Babu, Sarkaruvaari, Krishna-Movie

అలాగే నేను ఈవెంట్లో మొదటిసారిగా ఇలా స్టేజిపై వచ్చి మీ కోసం డాన్స్ చేశాను.ఇది 100 రోజుల ఫంక్షన్ లా అనిపిస్తోంది ఫంక్షన్ అంటే రాయలసీమలోనే చేయాలి అనిపించేలా ఉంది అని తెలిపాడు మహేష్ బాబు.పోకిరి, దూకుడు సినిమాల కన్నా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని నాన్న గారు అన్నారు.ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్.

హీరోయిన్ కీర్తి సురేష్ ఇక్కడికి రాలేకపోయారు ఆమెకు కూడా థ్యాంక్స్ అని తెలిపాడు మహేష్ బాబు.అలా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒకరి గురించి మాట్లాడుతూ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు మహేష్ బాబు.

అయితే ఈ సినిమా చూసిన తరువాత మహేష్ బాబు కొడుకు వచ్చి గట్టిగా హగ్ చేసుకోగా కూతురు సితార చాలా అందంగా కనిపించావు అని పొగిడిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube