సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.( Guntur Kaaram ) ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత మరో భారీ మూవీ లైన్లో పెట్టుకున్నాడు. రౌద్రం రణం రుధిరం వంటి సినిమాను తెరకెక్కించి గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ సినిమా చేయనున్నాడు.ఈ సినిమాను అతి త్వరలోనే లాంచ్ చేయడానికి రాజమౌళి అన్ని సన్నాహాలు చేస్తున్నాడు.ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన 30వ ప్రాజెక్ట్ ను సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.మహేష్ కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే సందీప్ వంగ ఒక పవర్ ఫుల్ స్టోరీని కూడా సిద్ధం చేసుకున్నాడు.సరైన సమయం వచ్చినప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కిస్తాను అని సందీప్ పలుసార్లు చెప్పుకొచ్చారు.
మరి ఈ విషయంపై తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ గ్యాంగ్ స్టర్ గా పవర్ ఫుల్ రోల్ చేయనున్నారట.ఈ స్టోరీని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ అందరిని ఆకట్టుకునేలా అద్భుతంగా సిద్ధం చేశారని టాక్.
ఇదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది పూనకాలు తెప్పించే న్యూస్ అనే చెప్పాలి.మరి రాజమౌళి ( Rajamouli )మూవీ ఎప్పుడు పూర్తి అవుతుందో ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో వేచి చూడాల్సిందే.