తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అమలు చేస్తున్న పథకంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఈ స్కీమ్ తమపై ఎఫెక్ట్ చూపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఈ స్కీమ్ గురించి ప్రముఖ నటి మాధవీలత( Madhavi Latha ) సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం( Free Travel ) చేసేలా ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం.
మాధవీలత తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో నిజం చెప్పాలంటే ఆడవాళ్లంటే నాకు చిరాకు అని ఫ్రీ బస్ టికెట్ మీ బ్రతుకు అంతేగా అంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు.మీకు అభివృద్ధి అవసరం లేదు అంతే కదా అని ఆమె ప్రశ్నించారు.
ఆడవాళ్లను ఈ భూమి మీద ఎవడూ బాగు చేయలేడని మీ బ్రతుకులు ఫ్రీ బస్ సీరియల్ కన్నీళ్లు మాత్రమేనని మాధవీలత అన్నారు.ఒక స్త్రీగా నేను మిమ్మల్ని చూసి జాలి పడుతున్నానని రెండేళ్ల తర్వాత తెలంగాణ మహిళలు( Telangana Women ) ఎలా ఉంటారో చూడాలని ఉందని ఆమె అన్నారు.నేను కాంగ్రెస్ ను ద్వేషిస్తున్నానని రేవంత్ ను కాదని మాధవీలత అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేను ఫ్రీ బస్ గురించి ఎప్పుడు పోస్ట్ పెట్టినా ఇన్స్టా గ్రామ్ మేధావులు మాత్రం మహిళలకు సంక్షేమం అవసరం లేదా అని ప్రశ్నిస్తారని ఆమె పేర్కొన్నారు.ఆటోలు నడుపుకునే వాళ్ల పెళ్లాలు బస్ లో వెళ్తారని ఆటోలు నడవక వాళ్ల పిల్లలు రోడ్ పై పడతారని మాధవీలత వెల్లడించారు.మాధవీలత చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
మాధవీలత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.