RC పురం పీ.యస్ పరిధిలో పోస్ట్ ఆఫీస్ లో ఈ నెల 13 వ తేదీ భారీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు.
మొత్తం 34,30,500 నగదు చోరీ జరిగింది ఇన్సైడర్లు చేసారని మొదట అనుమానించాము,అనుకున్నట్టే జరిగింది.అందులో స్వీపర్ గా పని చేసే మహమ్మద్ జహీర్ అనే వ్యక్తి దొంగతనం చేసాడు.
వాచ్ మెన్ పోయే వరకు వెయిట్ చేసి నైట్ దొంగతనం చేసాడు. మెయిన్ ఎంట్రన్స్ గ్రిల్స్ కట్ చేయడం, డోర్స్ లాక్స్ పగలగొట్టడం చేసాడు.28 లక్షల 50 వేల రుపాయలు నగదు రికవరి చేసాం మిగిలిన డబ్బుతో జల్సాలు చేసాడు.మోటార్ సైకిల్, ఐరన్ రాడ్, గ్యాస్ కట్టర్, స్వాధీనం చేసుకున్నాం 95% సొమ్ము రికవరీ చేశాం ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తున్న కార్యలయాలు సీసీ కెమెరాలు, అలారం,సెక్యూరిటీ ఖచ్చితంగా పెట్టుకోవాలి సుచించారు.
మాదాపూర్ హార్స్ రైడింగ్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన మాదాపుర్ పోలీసులు 25 వ తెదీ హార్స్ రైడింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసాం.మద్రాస్ లో మాదిరిగా మన దగ్గర కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్నాం.
బెట్టింగ్ నిర్వహిస్తున్న వాకా వెంకటేశ్వర్ రెడ్డి, వండిటి ప్రదీప్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసాం P & V Co అనే వాట్సాప్ గ్రూప్స్ ద్వారా చాలా మంది బెట్టింగ్ లో పాల్గొన్నారు ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహించారు చాలా మంది యంగ్ స్టార్స్ ఈ బెట్టింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు.నిందితుల నుండి 8 లక్షల నెట్ కాష్, లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నాం.