మే 9వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ‘ జగనన్నకు చెబుదాం ‘ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతుంది.దీనికోసం 1902 హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే దీని పై అనేకసార్లు సమీక్షలు చేపట్టిన ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) తాజాగా ఈ రోజు జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు జగనన్న భూహక్కు , భూ రక్ష పథకం, నాడు నేడు వంటి వాటిపైన జగన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకమో కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ వివరించారు.
” చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మనం ఎప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం.స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం.నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం.
ఇండివిడ్యువల్ గ్రీవెన్స్( Individual Grievances ) ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం.హెల్ప్ లైన్ కు కాల్ చేస్తే గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే, దాన్ని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి.”అంటూ జగన్ ఈ సమావేశంలో కలెక్టర్లు ఎస్పీలకు వివరించారు.
ఈ సందర్భంగా దీనికి సంబంధించిన విధి విధానాలను వివరించారు.సీఎంఓ ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లాలు డివిజన్ స్థాయిలో మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి.ఈ యూనిట్లు కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్ చేయాలి.
గ్రీవెన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తే అది సాధ్యమవుతుంది.
ప్రాజెక్ట్ మానిటర్ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది.హెల్ప్ లైన్ ద్వారా గ్రీవెన్స్ వస్తాయి.
వాటిని నిర్దేశిత సమయంలో నాణ్యతతో పరిష్కరించాలి.గ్రీవెన్స్ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం అంటూ జగన్ ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని వివరించారు.