తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీ స్టేటస్ ఉన్నటువంటి కుటుంబాలలో మంచు కుటుంబం ఒకటి.సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu ) టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత గాను విలన్ గాను హీరోగాను ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక మోహన్ బాబు నిర్మాతగా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికి కూడా మోహన్ బాబు పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి తన ముగ్గురు పిల్లలు కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు ( Vishnu ) కూతురు మంచు లక్ష్మి చిన్న కుమారుడు విష్ణు కూడా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.అయితే ఈ ముగ్గురికి కూడా ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారనే చెప్పాలి.ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా ఇండస్ట్రీలో తమ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఇక మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక విష్ణు విషయానికి వస్తే ఈయనకు నలుగురు సంతానం కాక ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇందులో పెద్ద అమ్మాయిలు ఇద్దరు కూడా కవల పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ పేర్లు అరియనా( Ariyana ) , విరియనా( Viriyana) .ఇద్దరు కూడా కవల పిల్లలు.వీరు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సింగర్లుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.తన తండ్రి విష్ణు నటించిన సినిమాలో వీరిద్దరూ ఒక పాట పాడిన సంగతి మనకు తెలిసిందే.
అయితే వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తెలుగు సినిమాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తన కుటుంబం మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు దీంతో మీకు తాతయ్య సినిమాలు అంటే ఇష్టమా లేక నాన్న బాబాయ్ అత్త సినిమాలంటే ఇష్టమా అనే ప్రశ్న ఎదురు కాగా వీరిద్దరూ షాకింగ్ సమాధానం చెప్పారు.అసలు మేము తెలుగు సినిమాలే చూడము అంటూ ఈ చిన్నారులు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.మరి పాటలైనా ఇష్టమా అని అడగడంతో మేము కేవలం ఇంగ్లీష్ పాటలు మాత్రమే చూస్తామని తెలుగు పాటలు చూడము అంటూ చెప్పినటువంటి వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి.
ఇలా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో పలువురు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఫ్యామిలీ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ వీరికి తెలుగు సినిమాలు తెలుగు పాటలు అంటే నచ్చకపోవడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు.