అల వైకుంఠపురంలో టీం పై క్రిమినల్ కేసు నమోదు....

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో అల వైకుంఠ పురం లో అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్, కథానాయకులుగా నటిస్తుండగా, టబు, మురళి శర్మ, సునీల్, అక్కినేని హీరో సుశాంత్, నవదీప్, సముద్రఖని వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

 Latest News About Ala Vaikuntapuramlo Movie-TeluguStop.com

అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మ్యూజికల్ కన్సర్ట్  పార్టీ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.అయితే ఇందుకుగానూ పోలీసులతో అనుమతి తీసుకునే సమయంలో ఈవెంట్ నిర్వాహకులు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గానూ ఈ చిత్ర యూనిట్ సభ్యుల పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

-Movie

ఇందులో భాగంగా మొదటిగా ఈ కార్యక్రమాన్ని రాత్రి 10 గంటల లోపు ముగిస్తామని అంతేగాక ఈ కార్యక్రమానికి 5 వేల నుంచి ఆరువేల మంది మాత్రమే వస్తారని చెప్పి పోలీసులతో అనుమతులు తీసుకున్నారు.అయితే ఈ నిర్వాహకులు చెప్పిందొకటి అక్కడ జరిగింది ఇంకోటి.రాత్రి 10 గంటలకి కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పి 11:30గంటల వరకు కొనసాగించారని అంతేగాక ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది అభిమానులు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను అల వైకుంఠ పురంలో టీం సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రం 12 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube