టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా కొనసాగుతున్నటువంటి అక్కినేని నాగచైతన్య ( Nagachaitanya ) హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇటీవల కాలంలో నాగచైతన్య వరుసగా ఫ్లాప్ సినిమాలను చవిచూస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ఉద్దేశంతో ఈయన తండెల్( Tandel )అనే సినిమాకు కమిట్ అయ్యారు.ఈ సినిమా త్వరలోనే దగ్గర షూటింగ్ పనులను జరుపుకోబోతోంది.
ఇకపోతే నాగచైతన్య వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే కొంతకాలం పాటు సంతోషంగా ఉన్నప్పటికీ వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు ఇలా సమంత విడాకులు తీసుకొని విడిపోయి తన కెరియర్ పరంగా బిజీగా ఉండగా నాగచైతన్య కూడా తన కెరీర్ పరంగా బిజీ అయ్యారు.ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్యకు సంబంధించినటువంటి ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇందులో భాగంగా ఈయన అఖిల్( Akhil ) కు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇలా నాగచైతన్య అఖిల్ కు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
నాగచైతన్య ఊర్లో లేనప్పుడు అఖిల్ ఇంటర్ చదువుతున్న సమయంలో అప్పుడప్పుడే నాగచైతన్య కారు కొన్నారట ఆ కార్ అఖిల్ కు చాలా బాగా నచ్చింది.అయితే అఖిల్ నాగచైతన్య ఇంట్లో లేకపోవడంతో తన కార్ తీసుకొని తన స్నేహితులతో కలిసి అలా సరదాగా రైడ్ వెళ్లారని తెలుస్తుంది.అయితే ఈ విషయం తన అన్నయ్యకు తెలియదు కానీ తనకు తెలిసేలోపే కార్ తెచ్చి ఎప్పటిలాగే సేఫ్ గా పార్కింగ్ ప్లేస్ లో పెట్టానని కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లేసరికి తనకు ఫోన్ వచ్చిందని అఖిల్ తెలిపారు.
అయితే కార్ తీసుకెళ్లిన విషయం నాగచైతన్యకు తెలిసిందని ఆ రోజు మాత్రమే తనని అన్నయ్య తిట్టారు అంటూ అఖిల్ తెలియజేశారు.
ఇలా వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలను అఖిల్ ఫోన్ కాల్ ద్వారా తెలియజేశారు అయితే నాగచైతన్య మాత్రం అఖిల్( Akhil ) మాటలు విన్న తర్వాత నాకు నా కారు నా బైక్ ఈ రెండు ప్రపంచము వీటిని ఎవరైనా తీసుకుంటే మాత్రం నేను సహించనని, అందుకే ఈ రెండింటిని తాను ఎవరికి ఇవ్వనని తెలిపారు అవసరమైతే వారికి డబ్బు అయినా ఇస్తాను కానీ నాకెంతో ఇష్టమైనటువంటి నా కారు బైక్ ఎవరైనా రైడ్ కి తీసుకువెళ్తే అసలు సహించని అంటూ నాగచైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వీడియో పై పలువురు కామెంట్ చేస్తూ మేము ఇంకా సమంత ( Samantha ) నీ ప్రపంచం అంటావ్ అనుకున్నాను కానీ కారు నీ ప్రపంచమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.బహుశా చలానా కట్టమని నాగచైతన్యకు మెసేజ్ వెళ్లి ఉంటుందేమో అందుకే నాగచైతన్యకు ఈ విషయం తెలుసు ఉంటుందంటూ పలువురు ఈ వీడియో పై ఫన్నీగా రియాక్ట్ అవుతూ కామెంట్లు చేయడం.