లగడపాటిని నమ్ముకుని ఇంతగా నష్టపోయారా ...?

రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను అంచనా వెయ్యడం… ఏ రాజకీయ పార్టీ గురించి ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉందొ అంచనా వేసి ఫలితాలకు దగ్గరగా… తన సర్వే రిపోర్ట్ ను బయటపెట్టడం కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్టయిల్ .అందుకే ఆయనకు అంత పొలిటికల్ క్రేజ్.

 Lagadapati Survey Gets Fail In Telangana-TeluguStop.com

ఆయన సర్వేలకు అంత విశ్వసనీయత.కానీ ఇప్పడు ఆ అంచనాలు… ఆ నమ్మకాలు అన్నీ తెలంగాణ ఎన్నికల పుణ్యామా అంటూ తప్పాయి.

లగడపాటి ఇప్పటివరకు సంపాదించుకున్న క్రెడిట్ అంతా ఒక్కసారిగా… తుస్ మంది.
తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఎన్నికలకు ముందు రోజు ఏదో వ్యూహంతో ప్రజాకూటమిదే విజయమని చెప్పారు.

ఎన్నికలు ముగిశాక అన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ స్పష్టమైన విజయం సాధిస్తుందని చెప్పగా.లగడపాటి మాత్రం ప్రజాకూటమి గెలుస్తుందని గట్టిగానే వాదించారు.లగడపాటి రాజగోపాల్.సర్వేల విషయంలో దిట్టగా పేరుపొందిన… ఆయన లెక్క మొట్టమొదటిసారి ఘోరంగా తప్పింది.ఆయన చెప్పిన ఫలితాల … వచ్చిన ఫలితాలకు అస్సలు సంబంధమే లేకుండా పోయింది.తెలంగాణలో మహా కూటమి 65 సీట్లు పైగా గెలుచుకుంటుందని ఆయన చెప్పినా ఆ లెక్క 20 కూడా దాటలేదు.

టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తోందని.ఆ పార్టీకి 35 కంటే సీట్లు వచ్చే అవకాశం లేదని లగడపాటి తన సర్వేలో చెప్పారు.

కానీ ఎవరూ ఊహించని విధంగా 85కు పైగా సీట్లు సాధించి వరుసగా రెండోసారి అధికారం అందుకోబోతోంది.

అంతే కాదు… తెలంగాణాలో ఇండిపెండెంట్లు పది సీట్లు వరకు గెలుస్తున్నారంటూ… లగడపాటి ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు.బీజేపీ కూడా 7 వరకూ సీట్లు గెలుస్తుందని చెప్పినా అదేమీ జరగలేదు.లగడపాటిని సర్వేల మీద నమ్మకంతో… పెద్దఎత్తున ప్రజాకూటమి గెలుస్తుందని బెట్టింగులు కాసారు చాలామంది.

అలాగే … ఆంధ్రాలో టీడీపీకి అనుకూలంగా ఉండేవారు ఇలా ఎక్కువగా ప్రజాకూటమిపై బెట్టింగ్ లు కట్టారు.ఫలితాలు పూర్తిగా తారుమారై టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

ఇక ఆరు నూరైనా … కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని గెలుస్తుందని అంతా భావించారు.ఈ విషయంలో కూడా భారీగానే బెట్టింగులు జరిగాయి.కానీ సుహాసిని ఓటమి పాలవ్వడంతో… బెట్టింగ్లలో ఓటమిపాలయిన వారంతా… లగడపాటి మీద తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube