ఎగ్జిట్ పోల్స్ అప్ డేట్స్ : అధికారం కూటమిదే .. లగడపాటి సర్వే ... ఇంకా ఏ సర్వే ఎలా ఉంది అంటే..?   Lagadapati Exit Polls Result Prajakootami Is Mejarty     2018-12-07   19:52:04  IST  Sai M

ఇప్పటివరకు తెలంగాణాలో జరిగిన పోలింగ్ సరళిని బట్టి వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసాయి.అయితే అన్ని సర్వేలు … తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ ఉంది అని ప్రకటించగా… ఆ ఫలితాలకు పూర్తి భిన్నంగా ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలపై మీడియా ముందు ప్రకటించాడు.

లగడపాటి రాజగోపాల్ సర్వే: మహాకూటమి 65 స్థానాలతో అధికారం చేపడుతుందని చెప్పారు. టీఆర్ఎస్‌ 35 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. ఒక 10 స్థానాలు అటుఇటు కావొచ్చని చెప్పారు. ఇక బీజేపీ 5 నుంచి 9, ఇండిపెండెంట్లు 5 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తారని చెప్పారు.

తెలంగాణలో మరోసారి కారుదే విజయమని టైమ్స్ నౌ, సీఎన్‌ఎక్స్ అంచనా వేసింది. టీఆర్ఎస్ 66 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. మహాకూటమికి 37 సీట్లు, బీజేపీకి 7 సీట్లు, ఎంఐఎంతో పాటు ఇతరులు 9 స్థానాల్లో గెలుస్తారని టైమ్స్ నౌప్రకటించింది.

న్యూస్-18 సర్వే కూడా టీఆర్‌ఎస్ పార్టీకే అధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది. టీఆర్ఎస్ 50-65 సీట్లు, మహాకూటమి 38-52, బీజేపీ 4-7, ఇతరులు 8-14 స్థానాల్లో గెలుస్తాయని న్యూస్-18.

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్: టీఆర్‌ఎస్ – 79 నుంచి 91, మహాకూటమి – 21 నుంచి 33, బీజేపీ – 1 నుంచి 3, ఇతరులు – 7.

రిపబ్లిక్‌ జన్‌కీ బాత్‌ సర్వే: టీఆర్‌ఎస్‌కు 52 నుంచి 65 స్థానాలు, ప్రజాకూటమికి 38 నుంచి 52 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 7 స్థానాలు, ఇతరులకు 8 నుంచి 14 స్థానాలు వస్తాయని అంచనా.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.